BJP చేతిలో TDP కీలుబొమ్మగా మారబోతుందా…? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

BJP చేతిలో TDP కీలుబొమ్మగా మారబోతుందా…?

BJP : ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పొత్తులపై చర్చ జరుగుతుంది. టిడిపి జనసేన పొత్తులు ఫైనల్ చేసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఒక అంచనాకు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తుపై క్లారిటీ వచ్చింది. అయితే ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు. ఎన్.డి.ఏ కూటమిలోకి టిడిపి పార్టీ చేరుతుందని గత రెండు సంవత్సరాలుగా వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మోడీ విధానాలను సమర్థిస్తానని ఇటీవల కాలంలో చాలాసార్లు […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,5:00 pm

BJP : ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పొత్తులపై చర్చ జరుగుతుంది. టిడిపి జనసేన పొత్తులు ఫైనల్ చేసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఒక అంచనాకు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తుపై క్లారిటీ వచ్చింది. అయితే ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు. ఎన్.డి.ఏ కూటమిలోకి టిడిపి పార్టీ చేరుతుందని గత రెండు సంవత్సరాలుగా వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మోడీ విధానాలను సమర్థిస్తానని ఇటీవల కాలంలో చాలాసార్లు ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్లి వచ్చారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ 2014 కూటమి రాబోతుంది అనే ప్రచారాలు చాలా రోజుల నుండి వినిపిస్తుంది. అయితే నిజానికి బిజెపి పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అరశాతం ఓట్లు కూడా లేవు. మరి ఎందుకు బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు వెంటపడుతున్నారు…? మన భారతదేశ మొత్తం మీద బిజెపి పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చాయి.

ఇక ఈ పార్టీతో పొత్తు వలన టిడిపి పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు అయితే ఏమీ లేవు కానీ పొత్తు పెట్టుకుంటే టిడిపి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే బిజెపితో పొత్తును వ్యతిరేకించే వర్గాలు టిడిపి పార్టీకి దూరమవుతాయి. టిడిపి క్యాడర్ కూడా అసలు బలం లేని బిజెపితో పొత్తు పెట్టుకొని తర్వాత తామే గెలిపించామన్న మాటలు ఎందుకు పడాలని వాదన వినిపిస్తుంది. ఇక బిజెపికి ఉన్న అరశాతం బిజెపి ఓటర్లు కూడా టిడిపి తో పొత్తు పెట్టుకున్న తర్వాత టిడిపికి ఓట్లు వేయారు అని అంచనా ఉంది. టిడిపిని మొత్తానికే వ్యతిరేకిస్తారు ఆ పార్టీ ఓటర్లు. కానీ జనసేన పార్టీతో మాత్రం పొత్తు కోసం బలంగా కోరుకున్నారు. జనసేన పార్టీకు గతంలో కూడా 6 శాతం వరకు ఓటు బ్యాంకింగ్ ఉంది. అందుకే జనసేనతో టిడిపి పొత్తు అందరూ వంద శాతం కోరుకుంటున్నారు. అయితే జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత బిజెపితో పనేముంది అని ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే బిజెపితో టిడిపి పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగవు అన్న అనుమానం అని చెప్పాలి. ఎందుకంటే వ్యవస్థలన్నింటినీ అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని చాలామంది నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఉండాలి.

ఈ క్రమంలోనే బిజెపి తమకు మద్దతుగా ఉండకపోయినా వైసీపీకి మద్దతుగా ఉండకూడదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే బిజెపితో పొత్తుకు చంద్రబాబు ఇంతలా ప్రయత్నించారని చెప్పాలి. అయితే ఈ అవకాశాన్ని బిజెపి పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అని చెప్పాలి. అయితే బిజెపి పార్టీ ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో 95% ఓటు బ్యాంకింగ్ కలిగి ఉంది. అందుకే కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ బిజెపి పార్టీకి దక్షిణాది రాష్ట్రాలలో పెద్దగా ఆదరణ లేదు. ఇక మూడవసారి ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పార్టీకి మిత్ర పక్షాలు ఎంతైనా కావాలి అని చెప్పాలి. ఈ క్రమంలోనే వైసిపి పార్టీ ఎలాగో పొత్తులో చేరదు కాబట్టి టిడిపి కు పొత్తులో చేరే అవకాశం ఉంది కాబట్టి బిజెపి పార్టీ దీనిని అవకాశం గా తీసుకొని పార్టీలో పొత్తుకు ఓకే చెప్పారు అని అర్థమవుతుంది. ఇక ఇప్పుడు కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రస్థాయి పార్టీలు బిజెపికి కీలుబొమ్మలా మారతాయని పలువురు అంటున్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక