Janasena : తాజాగా ఆంధ్రా లో రాజీనామా చేసిన వైసిపీ Ysrcp నేతలు రాజకియాలు వద్దంటూ ఇంటికి పరిమితమైన వారందరూ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు అని చెప్పాలి. వీరిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అలాగే రాజకీయాలకు ముగింపు పలికిన చాలామంది మంత్రులు, ముద్రగడ పద్మనాభం , కొణతాల రామకృష్ణ తదితర వైసీపీ నేతలు అందరూ ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన గొడుగు కిందకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంతో పోల్చి చూస్తే జనసేన చాలా బలహీనమైన పార్టీ అని చెప్పాలి. ఇక టిడిపి పార్టీ మాటల్లో చెప్పడానికి ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరితమైన కాపుల పార్టీ అని చెబుతుంటారు. అలాంటి పార్టీలో సామాజిక వర్గానికి చెందినవారు అరకోరా చేరడాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే పవన్ తో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా పార్టీ కి లబ్ధి చేకూరుతుందని టిడిపి నేతలు కూడా ఆశించారు.
అయితే తాజా పరిణామాలను గమనించినట్లయితే అదంతా రివర్స్ అవుతుందని చెప్పాలి. టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలన జనసేన పార్టీకి రాజకీయపరంగా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే టిడిపి హౌస్ ఫుల్ కావడం తో టికెట్ ఎవరికి వస్తుంది అనేది నమ్మకం లేదు. కానీ జనసేన పార్టీ లో చూస్తే మాత్రం నాయకుల కొరత కనబడుతుంది. ఆ పార్టీకి కనీసం నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరూ లేకపోవడంతో పార్టీకి 30 సీట్లు ఇచ్చిన నిలబెట్టుకునే పరిస్థితి కనపంచడం లేదు. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న నాయకులు ఒకొక్కరుగా జనసేన పార్టీ బాట పడుతున్నారు. జనసేన పార్టీలో చేరితే పొత్తు లో భాగంగా వారికి టికెట్ లభిస్తుందన్న అలోచనతో చాలామంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలోని తాజాగా కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతుండగా ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం మరియు ఆయన కుమారుడికి కూడా పవన్ సీట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. దీంతో టీడీపీ అంచనాలన్ని తారుమారయ్యాయని చెప్పాలి.ఎందుకంటే జనసేనలో నాయకులు లేకపోవడంతో జనసేన పార్టీకి సీట్లు ఇచ్చి అభ్యర్థులను కూడా తామే పంపుతామని అనుకున్న టిడిపి పార్టీ కి ఇది ఒక ఎదురు దెబ్బలా తగ్గుతుంది. అంతేకాక వారి పార్టీని అడ్డం పెట్టుకుని జనసేన పార్టీ బలపడుతుందని ఇది ఎప్పటికైనా తమకు ప్రమాదమే అని టిడిపి నేతలలో ఆందోళన కనిపిస్తోంది. మొత్తానికి పొత్తు కలుపుకోవడం వలన జనసేన పార్టీ కి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి దీనిని టీడీపీ ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాలి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.