JC Prabhakar Reddy : రప్పా రప్పా కాదు… రాత్రిపూట కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో చూసుకో -బైరెడ్డి కి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్..!
ప్రధానాంశాలు:
బైరెడ్డి..నీకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది.. దాన్ని దెబ్బతీయకూ.. పొగరు తగ్గించుకో - బైరెడ్డి కి జేసీ సూచనా
JC Prabhakar Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర సందర్భంగా పెద్ద పప్పూరులో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బైరెడ్డి చేసిన విమర్శలకు అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి .
JC Prabhakar Reddy : రప్పా రప్పా కాదు… రాత్రిపూట కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో చూసుకో -బైరెడ్డి కి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్..!
JC Prabhakar Reddy : నీకంటే ఎక్కువ బూతులు మీము మాట్లాడగలం గుర్తించుకో – బైరెడ్డి కి జేసీ హెచ్చరిక
“నీ లాంటి బచ్చా లీడర్లు ఎందర్నో చూస్తూ వచ్చాం. రప్పా రప్పా కాదు… రాత్రిపూట కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది” అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. తన మీద అప్రతిష్ట కలిగించేలా మాట్లాడటం సరైంది కాదని స్పష్టం చేశారు. “నువ్వు మాట్లాడే భాష మేం కూడా మాట్లాడగలం. నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలమని తెలుసుకో” అంటూ హెచ్చరించారు. కానీ ఆ స్థాయికి తమను తాము దిగజార్చుకోమని తెలిపారు.
అంతేకాదు రాజకీయాల్లో భవిష్యత్తు ఉన్న యువ నాయకుడిగా బైరెడ్డికి హితవు పలికిన జేసీ, “నీకు మంచి భవిష్యత్తు ఉంది, దాన్ని దెబ్బతీయకూ. పొగరు తగ్గించు, మాట్లాడే ముందు వెనక ముందు చూసుకో.. ప్రజలు ఎవరి మాటల్ని విశ్వసిస్తారో, ఎవరి పనిని గుర్తిస్తారో తేల్చేది ప్రజలే” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.