Junior NTR – Kodali Nani : చిరంజీవిని తిట్టినందుకు నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అందుకే ఆ రోజు అలా చేశారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR – Kodali Nani : చిరంజీవిని తిట్టినందుకు నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అందుకే ఆ రోజు అలా చేశారా?

 Authored By gatla | The Telugu News | Updated on :28 August 2023,6:00 pm

Junior NTR – Kodali Nani : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని.. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్, కొడాలి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మామూలు ఫ్రెండ్స్ కాదు.. జాన్ జిగ్రీలు అని చెప్పుకోవాలి. ఒక్క కొడాలి నాని, జూనియర్ మాత్రమే కాదు.. వల్లభనేని వంశీ కూడా జూనియర్ కు బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పుకోవాలి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి.. నందమూరి హరికృష్ణ.. కొడాలి నాని రాజకీయ ఎదుగుదలకు ఎంతో ప్రోత్సహించారు. అందుకే హరికృష్ణ కొడుకు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అంటే కొడాలి నానికి అభిమానం.

అయితే.. వీళ్ల మధ్య అంత అనుబంధం ఉన్నా కూడా ఒకరి ప్రొఫెషన్ లో మరొకరు వేలు పెట్టరు. ఎవరి ప్రొఫెషన్ వారిదే. కొడాలి నాని ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. మంత్రి గానూ పని చేశారు. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఒకరకంగా చెప్పుకోవాలంటే వైసీపీకి కొడాలి నాని ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. ఇక.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రపంచస్థాయి నటుడిగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గుర్తింపు పొందారు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఇద్దరి ప్రొఫెషన్స్ వేరు అయినప్పటికీ ఇద్దరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పటికీ కలుసుకుంటూ ఉంటారు.

junior ntr serious on kodali nani over chiranjeevi issue

Junior NTR – Kodali Nani : చిరంజీవిని తిట్టినందుకు నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అందుకే ఆ రోజు అలా చేశారా?

Junior NTR – Kodali Nani : టీడీపీని కొడాలి తిట్టినా పట్టించుకోని జూనియర్ ఎన్టీఆర్

అంతవరకు బాగానే ఉంది కానీ.. కొడాలి నాని టీడీపీ పార్టీని, చంద్రబాబును, ఆయన కొడుకు నారా లోకేష్ ను ఎంత తిట్టినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పట్టించుకోడు. అవి రాజకీయాలు. వాటి జోలి మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా జూనియర్ పట్టించుకోలేదు.

ఈ మధ్య ఏ విషయాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల కొడాలి నాని.. మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య మూవీ 200వ రోజు వేడుకల్లో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. మీరు ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు. మీరు అభివృద్ధి గురించి ఆలోచించండి అంటూ క్లాస్ పీకడంతో వెంటనే వైసీపీ ఎదురుదాడికి దిగింది.

కొడాలి నాని కూడా వెంటనే మెగాస్టార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పకోడీ గాళ్లు అంటూ మీడియా ముఖంగానే తిట్టేశాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపాయి. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవిని అలా నేరుగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు తిట్టలేదు. కానీ.. కొడాలి తిట్టడంతో అది చర్చనీయాంశం కావడంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్.. కొడాలిపై సీరియస్ అయ్యారట.

అసలు నువ్వు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. చిరంజీవిని ఎందుకు తిట్టావు అంటూ కొడాలిపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడట. క్లాస్ కూడా పీకాడట. ఇండస్ట్రీ గురించి అలా తప్పుగా మాట్లాడొద్దు అని క్లాస్ పీకడంతో ఇక చేసేది లేక.. చిరంజీవిని తాను ఏం అనలేదని.. అంటూ కొడాలి మరోసారి మీడియా ముందుకు వచ్చి తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. అది జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అని ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా.. మంత్రిగా పని చేసినా.. ఎవ్వరి మాటా వినని కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ మాట బాగానే వింటున్నాడు అంటూ అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది