Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  లిక్కర్ స్కామ్ పై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  •  Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..!

Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి విమర్శించారు. “వైఎస్సార్సీపీ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే – నిజం గట్టిగా చెప్పలేకపోయాం. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేకపోయాం” అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ, మద్యం కేసు పూర్తి ఫేక్ అని మండిపడ్డారు.

Kethireddy వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..!

Kethireddy : మద్యం అంశంలో చంద్రబాబు గత పాపాలను మరచిపోయాడు – కేతిరెడ్డి

కేతిరెడ్డి మాట్లాడుతూ .. “మాకు ఫేవర్ చేసినట్లయితే, ఎన్ని డిస్టిలరీలపై కేసులు పెట్టారు..? అసలు నిజంగా అవినీతి జరిగితే కేసులు ఉండేవి కదా?” అని ప్రశ్నించారు. ఈ మద్యం వ్యవహారం టీడీపీ తప్పుడు ప్రచారమే తప్ప వాస్తవమేం లేదన్నారు. మద్యం పాలసీ గురించి విమర్శలు చేసే ముందు, 1999-2004 మధ్య టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలను గుర్తు చేసుకోవాలి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి అసెంబ్లీలో “హూ ఈజ్ ద బిగ్ బాస్?” అంటూ చంద్రబాబుపై సూటిగా ప్రశ్నలు లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు హయాంలోనే మద్యం స్కాంలు తలెత్తాయని, ఆ సమయంలో లాభాల కోసం డిస్టిలరీలు, మద్యం కంపెనీలతో అక్రమ ఒప్పందాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయని కేతిరెడ్డి అన్నారు. “మా పాలనలో మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాం. ఆరోగ్యకరమైన పాలసీతో ముందుకు వెళ్ళాం. కానీ టీడీపీ మద్యం వ్యవహారాన్ని రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది” అని తెలిపారు. మద్యం అంశంలో చంద్రబాబు గత పాపాలు మరచి వైసీపీపై బురద చల్లడం విడ్డూరంగా ఉందన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది