Kodali Nani : గన్నవరం నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : గన్నవరం నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని ..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 February 2024,5:02 pm

ప్రధానాంశాలు:

  •  Kodali Nani : గన్నవరం నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని ..!

Kodali Nani : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైసీపీ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలలో టెన్షన్ పెరుగుతుంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. కీలక నేతలకు కూడా సీట్లు దక్కకపోవచ్చు అని ప్రచారం సాగుతుంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. ఈసారి గుడివాడ టికెట్ ను నానికి ఇవ్వడం లేదని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ఆయన స్థానంలో వైసీపీ సీనియర్ నేత మండవ హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో కొడాలి నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలనేది తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతారని, మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధం అని మండిపడ్డారు. వినేవాడు తెలుగు తమ్ముళ్లయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా వైయస్ జగన్ సీటు ఇచ్చారని చెప్పారు. వైరవీలు చేస్తేనో, బ్రోకర్ పనులు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో టికెట్లు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గుడివాడలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారు అంటూ వెలసిన ఫ్లెక్సీల పై కొడాలి నాని స్పందిస్తూ ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేసాడని అన్నారు. దమ్ముంటే తనను ఓడించడానికి చంద్రబాబు నాయుడు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

వైయస్ జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే తనకు వల్లభనేని వంశీకి సీట్లు లేవంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ నుంచి తాను గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తామని కొడాలి నాని చెప్పారు. నాపై చేస్తున్న అసత్య ప్రచారానికి చంద్రబాబుకి సవాల్ విసిరుతున్న దమ్ముంటే నాతో గుడివాడలో పోటీ చేయండి అని అన్నారు. అదెలాగో చేతకాదు. ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబునాయుడు ఎక్స్ నుండి ఛాలెంజ్ లు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతమే కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ ను కాకుండా తనలా మాజీలుగా ఉండే వాళ్లపై సోషల్ మీడియాలో ఛాలెంజ్ లో చేసుకోవాలి అని కొడాలి నాని అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది