Kodali Nani : కొడాలి నానికి సీరియస్.. హుటాహుటిన హైదరాబాద్‌కి తరలింపు..!
ప్రధానాంశాలు:
Kodali Nani : కొడాలి నానికి సీరియస్.. హుటాహుటిన హైదరాబాద్‌కి తరలింపు
Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురైనట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడారు. కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలున్నాయని వైద్యులు నిర్ధారించారు. కొద్దిరోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకున్న నానికి.. గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్‌కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని శశిభూషణ్ తెలిపారు.

Kodali Nani : కొడాలి నానికి సీరియస్.. హుటాహుటిన హైదరాబాద్‌కి తరలింపు..!
Kodali Nani గెట్ వెల్ సూన్..
కొడాలి నాని గుండె సమస్యలతో బాధపడుతూ తొలుత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరగా.. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయన్ను స్టార్ ఆస్పత్రికి మార్చినట్లు తెలుస్తోంది. నానికి అక్కడ మరోమారు పరీక్షలు నిర్వహించాక బైపాస్ సర్జరీ చేసే అవకాశాలున్నాయి. రెండు, మూడు రోజుల్లో నానికి బైపాస్ సర్జరీ చేస్తారని తెలుస్తోంది.మరోమారు పరీక్షలు నిర్వహించాక ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కొడాలి నాని ఆరోగ్యం పట్ల అందరిలో ఆందోళన నెలకొంది. కొంతకాలంగా కొడాలి నాని రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పరామర్శించేందుకు వచ్చారు. కానీ జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బయట ఉండిపోయారు. ఆ సమయంలో తనలో ఫైర్ తగ్గలేదని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడం ఫ్యాన్స్ ని టెన్షన్‌కి గురి చేస్తుంది.