Kodali Nani : చంద్రబాబు బయటికి వచ్చినా.. లోపల ఉన్నా జగన్ వెంట్రుక కూడా పీకలేడు.. కొడాలి నాని కౌంటర్ అదుర్స్
ప్రధానాంశాలు:
చంద్రబాబు బెయిల్ మీద వచ్చినా, రాకపోయినా మాకు అవసరం లేదు
2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు
చంద్రబాబు జైలులో ఉన్నా.. బయట ఉన్నా మాకు ఒక్కటే
Kodali Nani : ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక్క విషయం మీద చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అవడం కాదు.. చంద్రబాబుకు బెయిల్ రావడం. గత 52 రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజమండ్రి జైలులో ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి రోజు బెయిల్ కోసం కోర్టులకు దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మాత్రమే కాదు.. చాలా స్కామ్ లలో చంద్రబాబు పేరును సీఐడీ చేర్చింది. దీంతో ఆయా స్కామ్ లలోనూ ముందే చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కోర్టులు మాత్రం బెయిల్ ఇవ్వలేదు. కింది స్థాయి కోర్టుల దగ్గర్నుంచి పెద్ద స్థాయి కోర్టు సుప్రీంలోనూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసినా చుక్కెదురైంది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సుప్రీం లాయర్లను తీసుకొచ్చి వాదించినా ఫలితం లేకపోయింది. కానీ.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాత్రం మధ్యంతర బెయిల్ ను పొందగలిగారు చంద్రబాబు. అది కూడా అనారోగ్య కారణాల రీత్యా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మాత్రమే మంజూరు చేసింది. అంటే.. కేవలం 4 వారాలు మాత్రమే ఆయన బయటికి రానున్నారు. నవంబర్ 24న మళ్లీ చంద్రబాబు సరెండర్ కావాల్సి ఉంది.
చంద్రబాబు బెయిల్ పై టీడీపీ నేతలు సంబురాలు చేసుకుంటుండగా.. వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందిస్తూ.. జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదని 2014 లో టీడీపీకి అప్పటికప్పుడు ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా కనీసం అభ్యర్థులను కూడా పోటీకి పెట్టకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేసి గెలిపించానన్న భ్రమలో ఉన్నారు పవన్ కళ్యాణ్. 2019 లో జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు టీడీపీకి ఉన్న వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఆపేందుకు చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. లోకేష్, పవన్ ఇద్దరూ చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఆయన్ను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని మొదట్నుంచి అదే చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు కొడాలి నాని. మేమిద్దరం కలిసి ఉంటాం.. కలిసి పోటీ చేస్తాం.. అంటూ మాట్లాడుతున్నారు. మీరిద్దరూ ఏమైనా చేయండి.. మాకెందుకు అంటూ కొడాలి నాని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై మండిపడ్డారు.
Kodali Nani : 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు
చంద్రబాబు త్యాగాలు చేయాల్సిన పని లేదు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు. జగన్ మోహన్ రెడ్డి చేతుల్లో చావు దెబ్బ తింటారు. ఆయన జైలులో ఉన్నా.. బెయిల్ మీద బయటికి వచ్చినా జగన్ కు ఏం కాదు. వైసీపీని ఏం చేయలేరు. బెయిల్ మీద ఎన్ని రోజులు తిరుగుతారు. చాలా తక్కువ రోజులే కదా. మళ్లీ సరెండర్ కావాలి కదా. కాబట్టి చంద్రబాబు ఎక్కడ ఉన్నా మాకు ఎలాంటి ఫరక్ పడదు అని కొడాలి నాని స్పష్టం చేశారు.