
YS Sharmila : వైయస్ షర్మిల, రేవంత్ రెడ్డి భేటీ వెనుక వైయస్ జగన్ మీద పెద్ద కుట్ర..!!
YS Sharmila : వైయస్ షర్మిల రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వారు నడిచింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవారని వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు వైఎస్ షర్మిల వైయస్సార్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి చేపట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తో కలిసి వైఎస్ జగన్ ను గద్దె దింపడానికి కుట్ర చేస్తున్నారని వైసీపీ అంటుంది. రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడుని గెలిపించడానికి వైయస్ జగన్ గద్దె దింపడానికి వైయస్ షర్మిల కు రాజకీయంగానే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గతంలో తన బిడ్డ పెళ్లి పిలుపు కోసం వైఎస్ షర్మిలను కలిశారు. ఈ మధ్యకాలంలో ఆమెను కలిసింది లేదు. ఇక తాజాగా వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డిని ఫార్మాలిటీగా కలిశానని చెప్పారు.
ఇక ఏపీలో వైయస్ షర్మిల సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలకు ప్రజల నుంచి ఊహించని స్పందన వస్తుంది. తెలంగాణలో ఆమె పాదయాత్ర చేసినప్పుడు అంత స్పందన రాలేదు కానీ ఏపీలో సభలకు మంచి స్పందన వస్తుంది. దీంతో ఆమె వైయస్ జగన్ ఓటు బ్యాంకును ఎంతో కొంత చీల్చగలుగుతారు. చాలా నియోజకవర్గాలలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ఓట్లను చీల్చగలుగుతారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి పిలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కర్ణాటక నుంచి సిద్దా రామయ్య, తమిళనాడు నుంచి శివకుమార్ ప్రచారం కోసం వచ్చారు. ఈ ఐడియాను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తూ రేవంత్ రెడ్డిని ప్రచారం కోసం పిలుస్తున్నారు. ఇక అలాగే అమరావతిలో భారీ సభను ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీని పిలవాలని వైఎస్ షర్మిల ప్లాన్ చేస్తున్నారు.
ఇక సభల ఏర్పాటుకు ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అందుకు ఫైనాన్షియల్ గా రేవంత్ రెడ్డి సపోర్ట్ కోసం వైఎస్ షర్మిల ఆయనను కలిసినట్లుగా తెలుస్తుంది. అందుకు రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి అంటే వైసీపీకి అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి ప్రచారం చేయడంపై వైయస్ షర్మిల రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారని వైసీపీ వాదన చేస్తుంది. మొత్తం మీద వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వైయస్ షర్మిల గట్టి ప్లాన్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రచారం కోసం పిలుస్తూ ఎంతో కొంత ప్రజల నుంచి ఫేవర్ ని లాగేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.