Pawan kalyan చిరంజీవికి వైసీపీ కీలకపదవి..? ఆందోళనలో పవన్ కళ్యాణ్..!
Pawan kalyan : వినటానికి కొన్ని కొన్ని వార్తలు విచిత్రంగా అనిపించిన కానీ తరచి చూస్తే అందులోని వాస్తవాలు కొన్ని సార్లు విస్తుపోయేలా చేస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి కి వైసీపీ పార్టీ తమ తరుపున రాజ్యసభకు నామినేట్ చేయబోతుంది అనేది ఒక రకంగా విచిత్రమైన వార్త అనే చెప్పాలి. కానీ అత్యంత విశ్వశనీయ వర్గాల నుండి ఈ సమాచారం బయటకు లీక్ కావటంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన చిరంజీవి ఇంటికి వెళ్లిమరీ కలిసి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ Pawan kalyan , చిరంజీవి భేటీ క్యాజువల్ అని పైకి చెప్పినప్పటికీ తమ్ముడు Pawan kalyan కంగారు పడి అన్నయ్య ఇంటికి వెళ్లేసరికి అలాంటి పదవీ లాంటి ఆఫర్స్ తనకేమి రాలేదని మెగాస్టార్ నచ్చచెప్పటంతో పవన్ కళ్యాణ్ స్తిమితపడి వెనుతిరిగినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అదే కనుక జరిగి వైసీపీ చిరంజీవివికి రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తే, దానికి మెగాస్టార్ అంగీకారం తెలిపితే, ఇక జనసేన భవిష్యత్తు గల్లంతు అనే చెప్పాలి.
చిరంజీవి వైసీపీకి మద్దతుగా ఉంటె ఇక నాగబాబు ఎటు వెళ్లలేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఇక పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇచ్చే మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోవటమే కాకుండా కాపు వర్గం కూడా దాదాపుగా చీలిపోవటం ఖాయం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా పట్టుమని పది ఓట్లు తీసుకోని రాగలిగిన స్థాయి ఉన్నవాళ్లు కాదు. కనీసం వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వేయలేని పరిస్థితి. ఈ భయమే పవన్ కళ్యాణ్ కు పట్టుకోవటంతో చిరు ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
ప్రస్తుతం రాజ్యసభ కోటాలో వైసీపీకి కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ ఆంధ్ర కోటా నుండి రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉండటమే కాకుండా ఆ దిశగా మంతనాలు కూడా సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్ర కోటా నుండి రిలయన్స్ అధినేత అంబానీ తరుపున ఒకరిని రాజ్యసభకు పంపించాడు జగన్. ఇప్పుడు అదానీ తరపున పంపించటానికి కూడా పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఇలాంటి సమయంలో వైసీపీ నుండి చిరంజీవి రాజ్యసభ టిక్కెట్ అనేది ప్రచారంలోకి రావటం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఈ పుకారు ఎక్కడ నుండి పుట్టుకొచ్చిందో తెలియదు కానీ, దాని ప్రభావంతో పవన్ తన అన్నయ్యను కలిసి వివరణ మాత్రం తీసుకుంది వాస్తవమే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంతైనా రాజకీయాలు కదా.. గమ్మత్తుగానే ఉంటాయి
ఇది కూడా చదవండి ==> KCR : జగన్ చెక్ పెట్టటానికి కేసీఆర్ వ్యూహం.. ఇదేమి రాజకీయం దొర
ఇది కూడా చదవండి ==> Ys Jagan : పొయినసారి ‘పీకే’ ఉన్నాడు కాబట్టి ఓకే… మరి ఈసారి..!
ఇది కూడా చదవండి ==> TDP : టీడీపీకి ఇదే మంచి చాన్స్.. బాబు ఉపయోగించుకుంటారా..?
ఇది కూడా చదవండి ==> Ys Jagan : మంత్రి వర్గంలో మార్పులు.. సీఎం జగన్ ప్లాన్ సూపర్..!