MLA Kethireddy : స్కూల్ కి వెళ్లకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డికి అడ్డంగా బుక్కయ్యాడు.. వీడియో..!!
MLA Kethireddy : ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నేత. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో.. ప్రతి ఉదయం నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారాలు చూపించడం ఎమ్మెల్యే కేతిరెడ్డి స్టైల్. ఇక ఇదే సమయంలో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ..
దారి మధ్యలో పిల్లలు కనిపిస్తే వారి యొక్క క్షేమాలు తెలుసుకోవడం మాత్రమే కాదు వారి చదువు గురించి కూడా ఆరా తీస్తారు. ఎవరైనా గాలిగా తిరిగినట్లు రోడ్డు మీద కనిపిస్తే వెంటనే.. భయం కలిగేలా పోలీసుల దృష్టికి వారి విషయాలు తీసుకెళ్లడం జరుగుద్ది. అయితే రీసెంట్ గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థి రోడ్డు పైనే నిలబడ్డాడు. వెంటనే ఎమ్మెల్యే కేతిరెడ్డి అతని యోగక్షేమాలు తెలుసుకొని ఇంటర్ ఎందుకు జాయిన్ చేయలేదని అతని తండ్రిని నిలదీయడం జరిగింది.
తర్వాత మహిళా పోలీస్ ఇంకా డిజిటల్ అసిస్టెంట్ సచివాలయం సిబ్బందిని అలెర్ట్ చేసి సదరు విద్యార్థిని స్థానిక ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ అయ్యా రీతిలో జూనియర్ కాలేజ్ లో సీటు ఇప్పించే ఏర్పాటు చేయడం జరిగింది. విజయ సమయంలో సదరు విద్యార్థి తల్లి మరణించడంతో తండ్రి నిలదీసి పిల్లోడు చదువు ఆపొద్దని ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.