Mudragada Padmanabham : ఆ ఒక్క కండిషన్ తో వైసీపీలోకి ముద్రడ పద్మనాభం .. నియోజకవర్గం కూడా ఫిక్స్.. జనసేన ఓటమి ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mudragada Padmanabham : ఆ ఒక్క కండిషన్ తో వైసీపీలోకి ముద్రడ పద్మనాభం .. నియోజకవర్గం కూడా ఫిక్స్.. జనసేన ఓటమి ఖాయం..!

 Authored By anusha | The Telugu News | Updated on :20 December 2023,5:15 pm

ప్రధానాంశాలు:

  •  Mudragada Padmanabham : ఆ ఒక్క కండిషన్ తో వైసీపీలోకి ముద్రడ పద్మనాభం .. నియోజకవర్గం కూడా ఫిక్స్.. జనసేన ఓటమి ఖాయం..!

Mudragada Padmanabham : కాపు ఉద్యమనేతగా, నాయకుడిగా ఎన్నో దశాబ్దాల నుంచి తెలిసిన ముద్రడ పద్మనాభం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన త్వరలోనే వైసీపీలోకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటేనే మండిపడుతున్న ఆయన త్వరలోనే వైసీపీ లోకి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటుంటారు. వైసీపీలో చేరిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపించడం లేదు. ఆయన కుమారుడు ముద్రడ చల్లారావు కి వైసీపీ టికెట్ కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కాపు రిజర్వేషన్ కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా చంద్రబాబుతో జరిగిన అమీ తుమీ అన్నట్లుగా వ్యవహరించి వైసీపీకి మిత్రుడిగా మారిన ముద్రడ పద్మనాభం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన యాక్టివ్ కాలేదు. కానీ ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న మిథున్ రెడ్డి తో పాటు పలువురు నేతలు ముద్రడ ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో వైసిపి ఇన్చార్జిలో మార్పుపై ముద్రడ ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొడుకు చల్లారావు రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ దొరికితేనే పార్టీలోకి చేరేటట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్చార్జ్ యొక్క మార్పుపై కాక రేగుతుంది. ఈ క్రమంలో ముద్రడ చల్లారావు ఎంపీగా లేదా పెద్దాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే పెద్దాపూర్ లో గతంలో ఎమ్మెల్యేగా చేసిన తోట వాణి స్థానంలో ఆమె భర్త తోట నరసింహం కి సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపూర్ సీట్లో ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా ముద్రడా చల్లారావు కి టికెట్ కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అర్థబలం ఆధారంగా టికెట్ కేటాయింపు అవకాశం ఉండే తరుణంలో దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత ముద్రడ కచ్చితంగా వైసీపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క జనసేన కి మద్దతుగా సామాజిక వర్గంలోని కొందరు ముఖ్యులు తాజాగా పరిణామం చెందుతున్న దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినుంచి వారు పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఒంటరిగా పోటీ వద్దని పలు సందర్భా లలో చెప్పారు. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు.

తిరిగి ఇప్పుడు అదే పార్టీతో కలిసి అధికారం దక్కేల చేయడం ఏంటి అని కొందరు ప్రలోభ పడుతున్నారు. ఈ సమయంలోనే తాజా నిర్ణయాలు వాళ్ళకి రుచించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈమధ్య పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకి పవన్ హాజరు కానని చెప్పడంతో ఆయన హాజరయ్యేలా ఒప్పించారు. ఇదే సమయంలో పవన్ సీట్ల సంగతి తేల్చమని కొంతకాలం నుంచి ఒత్తిడి చేస్తుండగా తాజాగా చంద్రబాబు 20 నుంచి 30 అసెంబ్లీమ రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఒకపక్క ముద్రడా వైసీపీ లోకి వెళ్లబోతున్నారు . మరోపక్క టిడిపి జనసేన పొత్తులో సీట్లు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓడించే లక్ష్యంగా ముద్రడను వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైసీపీ లోకి తీసుకుంటున్నట్లు వార్త వస్తుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది