Nagababu : అన్నయ్య ప్రజారాజ్యంని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు : నాగబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagababu : అన్నయ్య ప్రజారాజ్యంని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు : నాగబాబు

 Authored By aruna | The Telugu News | Updated on :19 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagababu : అన్నయ్య ప్రజారాజ్యంని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు : నాగబాబు

Nagababu  : ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటినుంచే పార్టీలన్నీ సభలు ఇతర కార్యక్రమాలతో దూకుడు పెంచాయి. వైఎస్ఆర్ సీపీ సిద్ధం అంటుంది. టీడీపీ రా కదలిరా, శంఖారావం అంటుంది. అటు జనసేన పార్టీ కూడా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఇక జనసేన నేత నాగబాబు వరుస సమావేశాలలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన చిరంజీవి ప్రజారాజ్యం గురించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో మొదటిగా పవన్ కళ్యాణ్ బాధపడ్డారని, ఆ సమయంలో చాలా దూరంగా ఉన్నాడని అన్నారు. మనల్ని నమ్మి మనతో ప్రయాణించిన కార్యకర్తలకు న్యాయం చేయాలని, రాష్ట్రానికి మంచి చేయాలని చాలా కాలంగా ఆలోచించి జనసేన పార్టీని పెట్టారు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికల్లో నిరాశజనక ఫలితాలు వచ్చిన పట్టు వదలకుండా రాజకీయంలోనే ఉన్నారు. జీవితంలో సక్సెస్ వచ్చినప్పుడు సంతోషంగా, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్ గా ఉంటుంది. కానీ జనసేన పార్టీ ఎలక్షన్స్ లో పాల్గొని ఒక్క సీటు కూడా రాకపోయినా మనకు ఓటు వేసిన లక్షల కార్యకర్తలను న్యాయం చేయలేకపోయామని పవన్ కళ్యాణ్ బాధపడ్డారు. పరాజయం వస్తే చాలామంది డిప్రెషన్ లోకి వెళతారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్రెషన్ లోకి వెళ్లకుండా ధైర్యంగా మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ డిసప్పాయింట్ చేశారు. నేను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. నేనే అంతలా ఇబ్బంది పడితే ఇక పవన్ కళ్యాణ్ ను చాలా మాటలు అన్నారు. అయినా పట్టు వదలకుండా రాజకీయంలోనే ఉన్నారని అన్నారు.

ఆ తర్వాత వైయస్ జగన్ టీడీపీ, జనసేన పార్టీ లపై పంచులు వేసిన విషయంపై ఘాటువ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా నాగబాబు కౌంటర్ ఇచ్చారు. గ్లాస్ సింక్ లో ఉన్న తర్వాత మళ్లీ తేనేటి విందు ఇస్తుంది. కానీ ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు. సారు మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు, పంచుల మీద పెట్టిన శ్రద్ధ లో సగం ప్రజా పరిపాలన మీద పెట్టి ఉంటే బాగుండేది అని నాగబాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది 2024 ఎన్నికల జరగబోతున్న యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతుంది అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ, జనసేన పార్టీ లపై పంచులు పేల్చారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. సైకిల్ బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లో పడేయాలని వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం చేసిన కామెంట్స్ కు నాగబాబు ట్విట్టర్ వేదిక కౌంటర్ ఇచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది