Nagababu : నాగబాబు ఆశలు బాగనే ఉన్నాయి… ఇది సాధ్యమేనా బాబు..?
ప్రధానాంశాలు:
Nagababu : నాగబాబు ఆశలు బాగనే ఉన్నాయి... ఇది సాధ్యమేనా బాబు..?
Nagababu : తాజాగా జనసేన నాయకుడు నాగబాబు జనసేన కేడర్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వైసిపి పార్టీకి ఒక సీట్ కూడా రాకుండా చేయాలని కోరడం విశేషంగా మారింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి 151 సీట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసిపి పార్టీకి 0 సీట్లు రావడం ఎలా సాధ్యం అనేది నాగబాబుని చెప్పాల్సిందిగా పలువురు అంటున్నారు. పైగా వైసిపి పార్టీ వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగుతుంది. ఇక ఇది అత్యాశ కాదా అని జనసేన నాయకులు అనవచ్చు కానీ 151 యొక్క సీట్లు కలిగి ఉన్న పార్టీ మరో 24 సీట్లను కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీట్ సాధించిన జనసేన, మరియు 27 సీట్లు సాధించిన టిడిపి పొత్తులో భాగంగా కలిసి ఇప్పుడు వైసీపీ పార్టీ 150 సీట్లు కూడా లాగేసుకుంటాం అని చెప్పడానికి చాలా తేడా ఉంది అని అంటున్నారు.
ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం మీద పూర్తిస్థాయి వ్యతిరేకత ఇప్పటి వరకైతే బయటపడలేదు.అదేవిధంగా ఇప్పటివరకు వచ్చిన సర్వేలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఇప్పుడు కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని ఎక్కడ చెప్పలేదు. అంతేకాక వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు టిడిపి జనసేన కూటమికి విజయం దక్కుతుందని చెబుతున్నారు. ఇక నిష్పక్షపాతంగా సర్వేలు చేస్తున్నామని చెబుతున్న వారైతే రెండు పార్టీల మధ్య హోరా హోరి పోటీ నడుస్తుందని అంటున్నారు. కానీ నాగబాబు మాత్రం వైసిపికి ఒక సీట్ కూడా రాకూడదు అంటూ చేసిన వ్యాఖ్యలను ఇది అత్యస అని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.
నిజంగా వైసిపి పార్టీ అంత బలహీనంగా ఉంటే జనసేన పోత్తులు లేకుండా పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. పోత్తులు పెట్టుకుని బిజెపి కోసం రాయబారాలు చేస్తూ ఇంకా గెలుపు ధీమా వారికి కనపడలేదా అని వైసీపీ నేతలు కొనియాడుతున్నారు. అయితే ఎన్నికల్లో ఇలాంటివి జరగటం చాలా సహజమని చెప్పాలి. ఇంకా కొన్నిసార్లు ఆశకు బదులు అత్యాస కూడా పడుతుంది.ఇక ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ కూడా అవే అంటున్నారు కొందరు వైసీపీ నేతలు.ఏది ఏమైనప్పటికి గెలవాలనుకున్న కసితో ఉన్నప్పటికీ లాజిక్ తో మాట్లాడితే మాట్లాడితే బాగుంటుందని పలువురు చెబుతున్నారు.