Nagababu : పవన్ కళ్యాణ్ కొత్త గేమ్ ప్లాన్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ప్రధానాంశాలు:
Nagababu : పవన్ కళ్యాణ్ కొత్త గేమ్ ప్లాన్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
Nagababu : మెగా బ్రదర్ నాగబాబు Naga Babuకు ఏ పదవి ఇస్తారనే దానిపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది. ముఖ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.

Nagababu : పవన్ కళ్యాణ్ కొత్త గేమ్ ప్లాన్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
Nagababu కీలక పదవి..
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఆదేశించారు. దీంతో కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనేదానిపై ఓ క్లారిటీ వచ్చింది.
కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా నాగబాబుకి ఏ పదవి దక్కలేదు. ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒక మంచి పదవి దక్కుతుందని జనసేన Janasena కార్యకర్తలు ఎదురు చూశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవగానే ఆయనను శాసనమండలికి పంపి మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేసినట్లు సమాచారం. రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.