Group 2 Exam Center : తలపై జీలకర్ర బెల్లం.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్‌కి నవ వధువు.. వీడియో !
ప్రధానాంశాలు:
Group 2 Exam Center : తలపై జీలకర్ర బెల్లం.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్‌కి నవ వధువు
Group 2 Exam Center : అనేక గందరగోళాల మధ్య APPSC ఏపీ లో గ్రూప్ 2 మెయిన్స్ Group2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షకు ఓ నవవధువు తలపై జీలకర్ర , బెల్లంతో ..కళ్యాణం చీరతో హాజరుకావడంతో అందరూ చాలా ఆసక్తిగా ఆమెను చూశారు. తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ లో ఈ సీన్ కనిపించింది.

Group 2 Exam Center : తలపై జీలకర్ర బెల్లం.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్‌కి నవ వధువు.. వీడియో !
Group 2 Exam Center పెళ్లి బట్టల్లోనే..
తిరుపతి Tirupati కి చెందిన నమితకు ఈ రోజు తెల్లవారుజామున పెళ్లైంది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం , పెళ్లి బట్టలతో ఎగ్జామ్ సెంటర్ కు వచ్చేసింది. ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతోనే ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా, రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని కోరుతూ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ రోజు వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిన నమిత. ఫోటోలు, వీడియో లు వైరల్ గా మారాయి.రాష్ట్రంలో ఎమ్మెల్సీ MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు
ఈరోజు వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిన నమిత
గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కు వెళ్లిన నమిత
నమితకు బెస్ట్ విషెస్ చెప్పిన తోటి… pic.twitter.com/P9KDDnMSdv
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025