TDP and Janasena : కూటమిలో కొత్త గొడవలు… విశాఖలో పోటీ చేసేదేవరు…!
ప్రధానాంశాలు:
TDP and Janasena : కూటమిలో కొత్త గొడవలు... విశాఖలో పోటీ చేసేదేవరు...!
TDP and Janasena : విశాఖలో పొత్తుల పార్టీ విపక్షాల మధ్య గొడవలకు కారణమయ్యేలా ఉంది. టిడిపి జనసేన – బిజెపి జనసేన మధ్య ఆసక్తి పెరుగుతుంది. సీట్ల సర్దుబాటు పై క్లారిటీ లేకుండా నేతలు ఎన్నిక ప్రచారాలు మొదలుపెట్టడం తో గందరగోళం గా ఉంది . జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నచోట మిత్రపక్షాలు ఓ అడుగు ముందుకు వేసేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఆంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన వైసీపీ పార్టీ ఇప్పటికే హై వోల్టేజ్ ను సృష్టించింది. అభ్యర్థులను ఖరారు చేయడం సోషల్ ఇంజనీరింగ్ లో కూడా దూసుకుపోతుంటే విపక్ష పార్టీలు మాత్రం పొత్తులు పంచాయతీ దగ్గర ఆగిపోయాయి. దీంతో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని విపక్ష పార్టీల మధ్య సెగ పాట్లను బహిర్గతం చేస్తున్నాయి. గాజువాక ఉత్తర నియోజకవర్గం ల పరిధిలో పోటాపోటీ వాతావరణం వేడెక్కిస్తుంది. దీనికి కారణం టిడిపి జనసేన బిజెపిలు ఎన్నికల ప్రచారాన్ని శురు చేయడమే. ఎప్పుడు హాట్ ఫేవరెట్ గా ఉండే గాజువాకలో ప్రజల తీర్పు విలక్షణంగా ఉంటుంది. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లోను వేరువేరు పార్టీలు విజయం సాధించాయి. 2019లో జనసేన చీఫ్ పవన్ పోటీ రాజకీయాలను ఆకర్షించిన ఆ ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తించాయో పవన్ ఓటమి గ్లాస్ పార్టీకి అంతే నిరాశకు గురి చేశాయి. ఇక ఎన్నికల కోసం అభ్యర్థిని ప్రకటించిన వైసిపి ప్రచారంలో దూసుకుపోతుంది.
పోగొట్టుకున్న చోటే రా బట్టుకోవాలి అని టార్గెట్ లో ఉన్న జనసేన ఇక్కడ జెండా ఎగరేసేది తామేనని ప్రకటించి సీట్ రిజర్వ్ చేసుకుంది. పవన్ పోటీ చేయకపోతే తమకె ఛాన్స్ వస్తుంది అని నమ్మకంతో ఉన్న వైసిపి సభ్యుడు ఇంచార్జ్ కోణతారావు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు. భారీ బైక్ ర్యాలీలతో నియోజకవర్గం చుట్టేస్తూ క్యాడర్లలో క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి టిడిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. బాబు షిరిడి సూపర్ సిక్స్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న శ్రీనివాస్ ఒకటి నుంచి పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇక వైసీపీని ఢీకొట్టేందుకు టిడిపి జనసేన బిజెపి ల మధ్య కూటమి కట్టడం ఖాయమని ప్రచారం ఉన్నప్పటికి ఆ దిశగా పురోగతి లేదు. జనసేన టిడిపి బంధం ఏర్పడింది కాని బిజెపి జనసేన టై ప్రకటించుకుంటున్నాయి. దీంతో కీలక సీట్లలో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. బిజెపి జనసేన తమకు బలమైన సీట్లుగా చెప్పుకున్న జనసేన విశాఖ వెస్ట్ ముఖ్యమైనది. 2014లో మూడు పార్టీల కలయికగా కలిసి వచ్చి ఇక్కడ బిజెపి తరఫున విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడ బిజెపికి సుమారు 20వేల ఓట్లు పోల్ అయ్యాయి. అదే ఎన్నికలలో జనసేన గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి పసుపులేటి ఉషా కిరణ్ కు 20వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.
కాపు , ఓల్డ్ బ్యాక్ మెగాస్టార్ ఫ్యామిలీ అభిమాన సంఘాలు అన్ని కలిసి రావడంతో వార్తల లో జనసేన ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది. మరోసారి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ఉషా కిరణ్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జనసేన వైఖరి తెలియక ముందే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న విష్ణు కుమార్ రాజు ఎన్నికల ప్రచారం నుంచి వేడిని పుట్టించారు. టిడిపి జనసేన లో తమ రాజకీయ కార్యాచరనలపై కొంత క్లారిటీకి వస్తుండగా బిజెపి పరిస్థితి అయోమయంలో ఉండిపోయింది. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీ టిడిపి తో సర్దుబాటు చేసుకుంటుంది. కమలం మాత్రం పొత్తు పెట్టుకోవాలో వద్దో హై కమిటీ కన్ఫ్యూజన్. ఇలా ఎవరికి వారే ఎన్నికల ప్రచారం షురూ చేయడంతో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చ జరుగుతుంది.