AP Governor: ఏపీకి కొత్త గవర్నర్..దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ ల నియామకం..!!
AP Governor: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ లు మారారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా ఉన్నారు. ఈ పరిణామంతో బిశ్వ భూషణ్ హరిచందన్ ను చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేయడం జరిగింది. దీంతో ఏపీకి అబ్దుల్ నజీర్ నీ కొత్త గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జనరల్ కైవల్యాను నియమించారు. సికింద్రాబాద్ గవర్నర్ గా లక్ష్మీ ప్రసాద్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల, అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియానీ నియమించడం జరిగింది. సరిగ్గా ఎన్నికలవేళ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో రాష్ట్రాలకు గవర్నర్లను మార్చడం చర్చనీయాంశంగా మారింది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనసూయనీ మణిపూర్ గవర్నర్ గా నియమించడం జరిగింది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న గణేషన్.. నాగాలాండ్ గవర్నర్ గా నియమించారు. ఇంకా బీహార్ రాష్ట్ర గవర్నర్గా ఉన్న సాగు చౌహన్ ను .. మేఘాలయ గవర్నర్ గా నియమించడం జరిగింది.
ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ ను…. మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బీడీ.మిశ్రాను లడక్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించడం జరిగింది. లడక్ లెఫ్ట్ హ్యాండ్ గవర్నర్ రాధాకృష్ణన్ మధుర్, మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ప్రకటన కూడా చేయడం జరిగింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన ఎస్. అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.