Next CM JR NTR : అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Next CM JR NTR : అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు.. వీడియో వైరల్

Next CM JR NTR : వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడైతే చెప్పడం కష్టమే. అధికార వైసీపీ పార్టీ అయితే మేమే గెలుస్తున్నాం అంటూ ఘంటాపథంగా చెబుతోంది. వైనాట్ 175 అంటూ కొత్త నినాదంతో ముందుకెళ్తోంది. ఇక.. ఏపీలో ప్రస్తుతం వార్ అంటే వైసీపీ, జనసేన మధ్యే నడుస్తోంది. టీడీపీ చప్పబడిపోయింది. నిజానికి.. టీడీపీ యువనేత నారా లోకేశ్ బాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్నా ఆయన్ను పట్టించుకునేవారు లేరు. ఆయన పాదయాత్రకు అంతగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 July 2023,3:15 pm

Next CM JR NTR : వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడైతే చెప్పడం కష్టమే. అధికార వైసీపీ పార్టీ అయితే మేమే గెలుస్తున్నాం అంటూ ఘంటాపథంగా చెబుతోంది. వైనాట్ 175 అంటూ కొత్త నినాదంతో ముందుకెళ్తోంది. ఇక.. ఏపీలో ప్రస్తుతం వార్ అంటే వైసీపీ, జనసేన మధ్యే నడుస్తోంది. టీడీపీ చప్పబడిపోయింది. నిజానికి.. టీడీపీ యువనేత నారా లోకేశ్ బాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్నా ఆయన్ను పట్టించుకునేవారు లేరు. ఆయన పాదయాత్రకు అంతగా రెస్పాన్స్ రావడం లేదు.

ఒకప్పుడు టీడీపీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది.. అనేది తలుచుకుంటేనే బాధేస్తోంది టీడీపీ అభిమానులకు. దానికి కారణం.. ఇప్పుడు టీడీపీ ఏపీలో భూస్థాపితం అయింది. చంద్రబాబు వల్ల టీడీపీకి ఉన్న గౌరవం కాస్త పోయింది. టీడీపీకి యువరక్తం కావాలి. చంద్రబాబును ఇప్పుడు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే.. టీడీపీకి కొత్త నాయకత్వం కావాలి. అప్పుడు పార్టీకి మళ్లీ పునర్‌వైభవం వస్తుంది. మరి.. ఆ యువరక్తం ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు టీడీపీ అభిమానులు.2009 ఎన్నికలు గుర్తున్నాయా మీకు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరుపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయినా కూడా టీడీపీ గెలవలేదు. దానికి కారణాలు అనేకం కావచ్చు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హవా నడుస్తుండటం, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా టీడీపీ గెలవలేదు.

Jr ntr

Jr ntr

Next CM JR NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా?

ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. జూనియర్.. టీడీపీకి దూరమయ్యారు. చంద్రబాబుతో విభేదాలు వచ్చాయో.. ఏంటో కానీ..  అప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జూనియర్ మళ్లీ వచ్చి టీడీపీని తన చేతుల్లోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆరే సీఎం అంటూ అసలోడు వచ్చేవారు కొసరోడికి పండగే అంటూ ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నారా లోకేశ్ పర్యటన సమయంలో ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఏర్పాటు చేశారని అంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది