Pawan kalyan : పవన్ కళ్యాణా, మజకానా.. రాజకీయాలలోను కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడుగా..!
ప్రధానాంశాలు:
Pawan kalyan : పవన్ కళ్యాణా, మజకానా.. రాజకీయాలలోను కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడుగా..!
Pawan kalyan : సినిమాలలో పవన్ కళ్యాణ్ ఎప్పుడో ట్రెండ్ సృష్టించాడు. ఆయన ఇండస్ట్రీలో వేరే లెవల్. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన శైలిలో చరిత్ర క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాజకీయాలలో కూడా పవన్ ఓ ట్రెండ్ సెట్ చేసే పనిలో పడ్డాడు. డిప్యూటీ సీఎంగా పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆయన.. నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నారు. అయితే.. పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేయిస్తూ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై సర్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
Pawan kalyan పవనా, మజాకానా ?
పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించిన మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక.. పిఠాపురం నియోజవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ అందరిని అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై.. పిఠాపురం సమస్యలపై చర్చ జరుపుతున్నారు. అధికారులని అయితే ఉరుకులు పెట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తంగా చేస్తున్నారు.
జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో కలెక్టర్ చేపట్టే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లాంటి కార్యక్రమాన్ని కూడా నెలలో రెండు వారాలు పిఠాపురంలోనే ఏర్పాటు చేసే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ప్లాస్టిక్ భూతంపై యుద్ధాన్ని ప్రకటించారు పవన్ కల్యాణ్. తాజాగా.. కాలుష్య నియంత్రణపై రివ్యూ చేసిన పవన్.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరిని కూడా అలెర్ట్ చేస్తూ పవన్ పిఠాపురం అభివృద్ధి విషయంలో ముందు ఉండి మరీ ఆ గ్రామం ప్రయోజనాలపై దృష్టి పెట్టాడు. పవన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.