Pawan kalyan : ఫ్యాన్స్ వద్దు…టీడీపీ ముద్దు…బహిరంగ సభలో పవన్ కళ్యాణ్…ఇలా అయితే కష్టమే…
Pawan kalyan : ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే వారి అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రతిపక్ష పార్టీలను బెదరగొడుతుంది. ఇక రాబోయే ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో టిడీపీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కూడా […]
ప్రధానాంశాలు:
Pawan kalyan : ఫ్యాన్స్ వద్దు...టీడీపీ ముద్దు...బహిరంగ సభలో పవన్ కళ్యాణ్...ఇలా అయితే కష్టమే
ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు.
టీడీపీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను 24 సీక్రెట్లు తీసుకుంటే కొందరు విమర్శిస్తున్నారని
Pawan kalyan : ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే వారి అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రతిపక్ష పార్టీలను బెదరగొడుతుంది. ఇక రాబోయే ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో టిడీపీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కూడా పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఇక దీనిలో జనసేనకు 24 సీట్లు టీడీపీకి 151 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇక జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కల్పించడంతో జనసైనికులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. మీపై మాకు ఉన్న నమ్మకం మీ పైన మీకే లేకపోయిందా అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ తాజాగా ఓ భారీ బహిరంగ సభలో స్పందించడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను దూషిస్తూ టీడీపీ కు సపోర్ట్ గా నిలవడం అందర్నీ మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది అని చెప్పాలి.
అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయబోతుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే తమకు కూడా పోటీ చేసే అవకాశం దక్కుతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు కార్యకర్తలు ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. అయినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ తన ప్రతిష్ట కు దిగజారకుండ సీట్లు దక్కించుకుంటుందని అందరూ భావించారు కానీ ఇక్కడ కూడా నిరాశ ఎదురయింది. దీంతో జీర్ణించుకోలేని ఫ్యాన్స్ మరియు నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా జనసేనకు అండగా నిలిచిన ఫ్యాన్స్ ని నాకు అవసరం లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం నిజంగా చర్చించదగ్గ విషయంగా మారింది. దీంతో ఆయన తీరుపై చాలామంది మండిపడుతూ నీకు ఇదేమి దౌర్భాగ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే నిన్న టీడీపీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను 24 సీక్రెట్లు తీసుకుంటే కొందరు విమర్శిస్తున్నారని…జనసేన పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు జనసేన పార్టీకి అవసరం లేదని , పార్టీ గెలుపు కోసం నిలబడే వారు , పోరాడే వాళ్లే కావాలంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తనతోపాటు నడిచే వారే తన వాళ్లని, నిజంగా జనసేనకు మద్దతుగా నిలిచేవారైతే నన్ను ప్రశ్నించవద్దంటూ ఫ్యాన్స్ ని నాయకులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు . దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర చర్చానియాంశంగా మారాయి. ఇన్నేళ్లుగా నీకు అండగా నిలబడిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లుగా నీపై నమ్మకం పెట్టుకున్నందుకు మాకు తగిన బుద్ధి చెప్పావు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.