Pawan kalyan : పవన్ కళ్యాణ్ కు కిక్ ఎక్కింది.. సోము సామాన్యుడు కాదు
Pawan kalyan : “చెప్పకూడదు కానీ మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కు ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనే ఆలోచన మాకు ఉంది”… ఈ మాట ఎప్పుడైతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుండి వచ్చిందో అప్పటి నుండి తిరుపతి ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి అనే కోణంలో ముందుకు వెళ్తుంది.
నిన్న మొన్నటిదాకా బీజేపీ-జనసేన పొత్తు వుంటుందా..? పోతుందా? అని భావిస్తున్న తరుణంలో తిరుపతి బై ఎలక్షన్స్ సందర్భంగా మరింత బలోపేతం అయ్యింది వాళ్ళ బంధం. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని సోము వీర్రాజు చెప్పటంతో జనసేనకు ఎక్కడ లేని జోష్ వచ్చింది. ఈ ఎన్నికల్లో అసలు జనసేన మద్దతు బీజేపీకి ఉంటుందా..? పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తాడా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఏప్రిల్ 3 న తిరుపతి జనసేనాని భారీ బహిరంగ సభ లో పాల్గొనబోతున్నాడు. దాని తర్వాత రెండో విడత నెల్లూరు లో కూడా మరో సభలో పవన్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ చెప్పటం జరిగింది.
Pawan kalyan : పదవి అనేది ఒక మత్తు
ఏ రాజకీయ నాయకుడికి అయిన పదవి అనేది ఒక మత్తు లాంటిది. పదవి అనే ఆశ లేకపోతే నేతలకు కిక్ ఇవ్వదు. ఎంతటి వారైనా పదవీదాసులే అని చెప్పక తప్పదు. అలాంటిది తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని బీజేపీ చెప్పటంతో పవన్ తో సహా ఆయన సైనికులు సైతం ఆనందంలో మునిగిపోతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం తర్వాతి విషయం, ప్రస్తుతం ఆ మాట చాలు అనుకుంటున్నారు జనసైనికులు. అందుకే తిరుపతిలో బీజేపీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఇక జనసేన విషయంలో బీజేపీ నేత సోము వీర్రాజు వేసిన ఎత్తుగడకు మిగిలిన రాజకీయ నేతలు బిత్తరపోయారు. ఇంత లౌక్యం సోముకు ఎక్కడ నుండి వచ్చిందో అంటూ అరాలు తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించటంతో ఇటు జనసైనికులు తిరిగి బీజేపీని భుజాలకెత్తుకున్నారు, అటు టీడీపీకి ఊహించలేని షాక్ తగిలింది. బీజేపీ -జనసేన పొత్తు సన్నగిల్లితే పవన్ ను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్న తెలుగుదేశంకు ఇది ఊహించని పరిణామం అనే చెప్పాలి, బహుశా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు.