Pawan Kalyan : మోడీకి మరోపేరు ఉన్న విషయాన్నీ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 3 May 2025, 6:00 pm
  •  Pawan Kalyan : మోడీకి మరోపేరు ఉన్న విషయాన్నీ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరికీ చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయ నాయకులు సభల్లో ముందుగా పేరును పలుకుతారు, తర్వాత తమ మాటలతో అనుసంధానంగా ప్రసంగాన్ని కొనసాగిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అదేలా మొదలుపెట్టి, తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీకి “నమో” అనే అభివాదం ద్వారా ఒక వినూత్న కోణాన్ని చూపించారు. ఫస్ట్ టైం మోడీని ఆలా అనేసరికి మోడీతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్య పోయారు.

Pawan Kalyan : మోడీకి మరోపేరు ఉన్న విషయాన్నీ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : మోడీకి మరోపేరు ఉన్న విషయాన్నీ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : మోడీకి ఈ పేరు కూడా ఉందా..? పవన్ చెప్పేవరకు చాలామందికి తెలియదు

అంతటితోనే ఆగకుండా పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి మరో పేరు ఉన్న విషయాన్నీ కూడా తెలియజేసాడు. “అనివాస్” అనే మరో పేరు మోడీకి ఉందని , ఇది ఆయన సన్యాస జీవితం గడిపిన సమయంలో పుట్టిన పేరు అన్నారు. హిమాలయాల్లో నివాసం లేకుండా సన్యాసిగా కాలం గడిపిన మోదీని, మిత్రులంతా “నివాసం లేనివాడు” అని భావించి, సరదాగా “అనివాస్” అని పిలిచేవారు. ఈ విషయం బహిరంగంగా వెలుగు చూసింది పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారానే.

ఇది ప్రధాని మోదీ వ్యక్తిత్వంలోని త్యాగం, సాదాసీదా జీవనశైలి గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మోదీకి సొంత ఇల్లు లేని అనుభవం ఉండటం వల్లే, పేదలకు ఇళ్ల అవసరం ఎంత ముఖ్యమో ఆయనకు తెలిసిందన్నారు. అందుకే మోదీ పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే సంకల్పంతో పనిచేశారన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని జీవితంలోని తెలియని కోణాన్ని బయటపెట్టడంతోపాటు, జనసేనాని ప్రసంగాన్ని ప్రత్యేకంగా నిలిచేలా చేసింది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి