Pawan Kalyan : ప్రమాదంలో పిఠాపురం.. ఏకంగా రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం..!
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ వరదలతో అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఏ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక అక్కడ ప్రజలు భయం గుప్పెట్టలో బతుకుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురంకి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు.రాష్ట్రంలో కురిసిన వర్షాలతో ఏలేరు […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : ప్రమాదంలో పిఠాపురం.. ఏకంగా రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం..!
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ వరదలతో అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఏ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక అక్కడ ప్రజలు భయం గుప్పెట్టలో బతుకుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురంకి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు.రాష్ట్రంలో కురిసిన వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వరద నీటి వల్ల పిఠాపురం ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేయడంతో సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.
Pawan Kalyan స్వయంగా రంగంలోకి..
రిజర్వాయర్ కేపాసిటీ 24 టీఎంసీలని, ఇప్పటికే 20 టీఎంసీల నీరు వచ్చిందని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చూడాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఏలేరు వరదపై అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు ఆలత అధికారులతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితులు, సహాయక చర్యలపై పవన్ కల్యాణ్‌కు జిల్లా కలెక్టర్ వివరించారు. కాగా పవన్ సోమవారం కాకినాడ వెళ్లనున్నారు. నియోజకవర్గంలో ఉండి అధికారులతో సమీక్షలు చేయనున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు రిజర్వాయర్‌కి ఇప్పటికే 21 టీఎంసీల నీరు చేరింది.
దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ వెల్లడించారు. ఏలేరు వరద ముప్పు పొంచి ఉన్న క్రమంలో నియోజకవర్గంలో ఉండి పరిస్థితులను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు.