Sankranti Festival : సంక్రాంతి కి కొడి పందేలు చూశారు… కానీ కొత్తగా పందులతో పందేలు.. వీడియో..!
Sankranti Festival : సంక్రాంతి పండగ అంటే మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, గాలి పటాలు ఎగరేయడం కాదు. సరికొత్తగా పందేల ఆట కూడా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం.సాధారణంగా సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కొడి పందేలు. కానీ హైకోర్టుతో పాటు, ఏపి ప్రభుత్వం ఈ కోడి పందేలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కోడి పందేలకు బదులు వినూత్నంగా పందుల పందేలను ఏర్పాటు చేశారు. ఈ పందేలను చూడటానికి జిల్లా ప్రజలే కాదు పక్క జిల్లాల ప్రజలు కూడా తరలి వస్తుంటారు. అయితే కోడి పందాలకు ఏ మాత్రం తగ్గకుండా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో వరాహ పోటీలు నిర్వహణ జరిగింది.
Sankranti Festival : వినూత్న పందేలు..
తాజాగా పందుల పోటీలకు పందెం రాయుళ్లు పోటెత్తారు. వరహాల పందాలపై కోట్ల రూపాయలు బెట్టింగులు జరిగాయి. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు చెబుతారు. ఈ పందేలను జేసి దివాకకర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ప్రజలను కంట్రోల్ చేస్తూ కర్ర చేత పట్టుకుని హల్ చల్ చేశారు జేసి. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతన్నాయి.
అయితే పందులు పోటీలు అనేది, పందుల మధ్య నిర్వహించే పోటీలు. సంక్రాంతి వంటి పండుగల సమయంలో పందుల పోటీలు నిర్వహిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువగా పందుల పోటీలు నిర్వహిస్తుంటారు. రాజుల కాలంలో పందుల పోటీలు నిర్వహించేవారని గిరిజనులు చెబుతున్నారు.సంక్రాంతి సమయంలో కోడి పందేలకు బదులు పందుల పోటీలు నిర్వహిస్తారు. ఇక ఈ సారి పడవల పోటీలు కూడా జరిగాయి. ఒక కిలోమీటర్ డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్ లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, జంగారెడ్డి గూడెం జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవల పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. గత మూడు రోజులుగా గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ జరిగాయి. 11 జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు, 12 జట్లు పోటీ పడ్డాయి.
సంక్రాంతి అంటే కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పోటీలు చూసుంటాం.. కానీ పందుల పందాలు చూశారా..?
కోడి పందాలకు ఏ మాత్రం తగ్గకుండా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో వరాహ పోటీలు నిర్వహణ
పందుల పోటీలకు పోటెత్తిన పందెం రాయుళ్లు
వరహాల పందాలపై కోట్ల రూపాయలు బెట్టింగులు
పందుల పోటీలు… pic.twitter.com/64zKX2udY0
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025