Viral Video : ఏపీలో కరెంట్ కష్టాలు.. సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో పేషెంట్‌కి ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. వీడియో వైరల్ !!
Viral Video : ఏపీలో కరెంట్ కష్టాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం. అవును.. ప్రస్తుతం ఏపీలో తీవ్రస్థాయిలో కరెంట్ కోతలను విధిస్తున్నారు. దీంతో ప్రజలు కరెంట్ లేక అల్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెడితే చివరకు ఆసుపత్రుల్లోనూ కరెంట్ లేక వైద్యులు, పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంత దారుణం అంటే.. పేషెంట్ కి సెల్ ఫోన్ లైట్ వెలుగులో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేందుకు ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేదు. పేషెంట్ కి ట్రీట్ మెంట్ చేయాలి. ఎలా.. ఎంత సేపు వెయిట్ చేసినా కరెంట్ రావడం లేదు. దీంతో సెల్ ఫోన్ లైటే డాక్టర్లకు దిక్కు అయింది. సెల్ ఫోన్ లైట్ లోనే ఆ పేషెంట్ కు ట్రీట్ మెంట్ చేయాల్సి వచ్చింది.మన్యం జిల్లాలో కరెంట్ కోతలు ఇప్పుడే కొత్తేమీ కాదు. ఏపీలోని ఇతర ప్రాంతాల్లో వేరు.. మన్యం జిల్లాలో వేరు. అక్కడ కరెంట్ కోతలు ఉన్నా విద్యుత్ అధికారులు పట్టించుకోరు.
Viral Video : మన్యంలో కరెంట్ కోతలు.. పట్టించుకోని అధికారులు
తాజాగా కురుపాం ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేక చివరకు కరెంట్ ను నమ్ముకుంటే పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో చికిత్స అందిస్తున్నారు. ఆ వీడియో చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీ లో కరెంట్ కష్టాలు
మన్యంలో పట్టించుకొని విద్యుత్ అధికారులు. కరెంట్ లేక సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స.
పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ కోతల వల్ల కురుపాం ప్రభుత్వ వైద్యశాలలలో సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స అందిస్తున్న దృశ్యాలు. pic.twitter.com/tKDCkcN06d
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2023