Rahul Gandhi : లోక్ సభ ఎన్నికలకు రెడీ .. విశాఖ నుంచి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rahul Gandhi : లోక్ సభ ఎన్నికలకు రెడీ .. విశాఖ నుంచి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ…!!

Rahul Gandhi : కాంగ్రెస్ హై కమాండ్ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఏపీలోని విశాఖ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తుంది. ఏపీలో సైతం కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఉనికి చాటాలని ఓట్ల శాతం పెంచుకోవాలని […]

 Authored By anusha | The Telugu News | Updated on :8 January 2024,3:00 pm

Rahul Gandhi : కాంగ్రెస్ హై కమాండ్ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఏపీలోని విశాఖ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తుంది. ఏపీలో సైతం కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఉనికి చాటాలని ఓట్ల శాతం పెంచుకోవాలని గట్టి నిర్ణయంతో ఉంది. వై.యస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. వారి చేరికతో కాంగ్రెస్ నాయకత్వం మళ్లీ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.

ఇటువంటి తరుణంలో విభజన హామీలపై స్పష్టమైన ప్రకటనలు చేస్తే వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తుంది. అందుకే రాహుల్ గాంధీ ఏపీ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో ప్రత్యేక లైన్ తీసుకుని కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తద్వారా పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. అటు విశాఖ లోకసభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే గెలవడం సులువు అని భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేధి సొంత నియోజకవర్గంగా ఉండేది. ఎప్పుడు అక్కడి నుంచే పోటీ చేసేవారు కానీ గత ఎన్నికల్లో అమెధిలో పాటు కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఒకచోట మాత్రమే గెలిచారు.

ఈసారి కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. విశాఖ అయితే సేఫ్ జోన్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారు. అటు తన పాదయాత్ర ప్రారంభించక ముందే విశాఖ వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక త్వరలోనే రాహుల్ గాంధీ జోడోయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించిన లోగోను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది