Rayapati Aruna : ఎంపీ మార్గాని భరత్ కి గట్టిగా ఇచ్చిపడేసిన రాయపాటి అరుణ ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rayapati Aruna : ఎంపీ మార్గాని భరత్ కి గట్టిగా ఇచ్చిపడేసిన రాయపాటి అరుణ ..!

Rayapati Aruna : జనసేనలో అందరికీ తెలిసిన నాయకుల్లో ముఖ్యంగా మహిళ నేతల్లో రాయపాటి అరుణ ఒకరు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు. టీవీ డిబేట్ లలో పార్టీ తరపున మాట్లాడడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. అలాంటి రాయపాటి అరుణ తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. వైసీపీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rayapati Aruna : ఎంపీ మార్గాని భరత్ కి గట్టిగా ఇచ్చిపడేసిన రాయపాటి అరుణ ..!

Rayapati Aruna : జనసేనలో అందరికీ తెలిసిన నాయకుల్లో ముఖ్యంగా మహిళ నేతల్లో రాయపాటి అరుణ ఒకరు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు. టీవీ డిబేట్ లలో పార్టీ తరపున మాట్లాడడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. అలాంటి రాయపాటి అరుణ తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. వైసీపీ పార్టీ పదవీకాలం ముగియనుంది. అయినా ఇప్పటికీ వైసీపీ నాయకులు ఏం చేశారు ఏం సాధించామో చెప్పకుండా నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

ప్రజల డబ్బులతో ‘ సిద్ధం ‘ అని బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ గా జనసేన నాయకులు జనసేన జెండాలు పెట్టారు. దానికి రీల్స్ స్టార్ అయిన ఎంపీ భరత్ రామ్ వేసిన కౌంటర్ సిగ్గుచేటుగా ఉందని అరుణ అన్నారు. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి ఎంపీ భరత్ మాట్లాడడం హాస్యంగా ఉందని అన్నారు. వైసీపీ పార్టీకి జరిగిన డ్యామేజ్ కి వాళ్లకి ఎప్పుడో సిగ్గు రావాలి. వచ్చే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయబోతున్న ఎంపి భరత్ జనాల వద్దకు వెళ్లి తనకు ఓటు వేయమని ఎలా అడుగుతాడు. పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా వాళ్లు విడిపోయి వాళ్ల జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

కానీ ఎంపీ భరత్ ఒక పెళ్లి చేసుకొని తన భార్యని టార్చర్ పెడుతూ గృహం హింస కేసులు పెట్టించుకుంటూ సిగ్గు లేకుండా రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. నువ్వేమైనా పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా.. నీ భార్య నీ మీద గృహహింస కేసులు పెడుతున్నా సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గంలో ఓట్లు అడుగుతాడు అని రాయపాటి అరుణ ఎంపీ భరత్ పై విరుచుకుపడ్డారు. ఊర్లలో రోడ్లు లేవు, విద్యాలయాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా వేయలేదు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మీ బ్రతుకులకు ఐదేళ్ల కాలం సరిపోయింది. ఎమ్మెల్యేగా ఎంపీగా తమ నియోజకవర్గాలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఒకరి వైవాహిక జీవితం గురించి మాట్లాడే హక్కు లేదని రాయపాటి అరుణ ఎంపీ భరత్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక