Rk Roja : పండగ పూట ఆ వెధవ గురించి ఎందుకు.. ఏపీ మంత్రి ఆర్కే రోజా ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rk Roja : పండగ పూట ఆ వెధవ గురించి ఎందుకు.. ఏపీ మంత్రి ఆర్కే రోజా ..!

Rk Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద భవాని ఐలాండ్ లో ఆదివారం కార్తీక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్తీక మహోత్సవం లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం రోజా మాట్లాడుతూ .. ప్రజల సమక్షంలో ఈరోజు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వనబోజనాలు కూడా జరగబోతున్నాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా […]

 Authored By anusha | The Telugu News | Updated on :27 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  పండగ పూట ఆ వెధవ గురించి ఎందుకు.. ఏపీ మంత్రి ఆర్కే రోజా

  •   Rk Roja satires on that politician

  •  Rk Roja : పండగ పూట ఆ వెధవ గురించి ఎందుకు.. ఏపీ మంత్రి ఆర్కే రోజా ..!

Rk Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద భవాని ఐలాండ్ లో ఆదివారం కార్తీక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్తీక మహోత్సవం లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం రోజా మాట్లాడుతూ .. ప్రజల సమక్షంలో ఈరోజు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వనబోజనాలు కూడా జరగబోతున్నాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను టూరిజం , కల్చరల్ మినిస్టర్ గా చేసినందుకు. ఒక తెలుగు అమ్మాయిగా మన సంస్కృతి సాంప్రదాయాలను, మన పండుగలను భావితరాలకు అందిస్తున్నాను.

ఇప్పటి తరం పిల్లలకు వీటి గొప్పతనం తెలియజేయాలి అనుకున్నాం. నేను మంత్రి అయిన దగ్గర నుంచి ఇక్కడ సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలను కూడా చేయడం జరిగింది. కార్తీకమాసం ఎంతో ముఖ్యమైనది అని మీకు తెలుసు. ఇక కార్తీక పౌర్ణమి రోజు శివపార్వతుల కళ్యాణం చూస్తే సకల పాపాలు పోయి శివపార్వతుల ఆశీర్వాదం కలుగుతుందని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం. ఈరోజు కార్తీక పౌర్ణమి నే కాకుండా శని త్రయోదశి కూడా. ఈ నెలలో ఒంటిపూట భోజనాలు, కార్తీక స్నానాలు, దీపారాధనలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం.

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా పండగలపై అంత శ్రద్ధ చూపడం లేదు. గతంలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి పోతే పండగల గురించి తెలుస్తుండేది. ఈరోజు అంత దూరం వెళ్లలేకపోతున్న వారికి విజయవాడ నడిబొడ్డులో భవాని ఐలాండ్ లో దిగితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినట్లే ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని, సాంప్రదాయ పద్ధతులను పరిరక్షిస్తూ అన్ని దేవాలయాలను కూడా పునర్నిర్మించడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు మీకు తెలుసు. పురాతన ఆలయాలను కూల్చేసి బాత్రూం లు కట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు.

విజయవాడ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటిని జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మిస్తున్నారు. అలాగే కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా రెన్యువేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలను పరిరక్షిస్తూ పూజారులను కూడా గౌరవిస్తూ వారికి ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. నేను ఈ పదవిలో ఉన్నంతవరకు మన సాంప్రదాయానికి భావితరాలకు అందిస్తూ ఉంటానని రోజా చెప్పుకొచ్చారు. ఇక చివర్లో ఓ విలేఖరి లోకేష్ గారు పాదయాత్ర చేయబోతున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అని అడగ్గా దానికి బదులుగా రోజా.. పండగ పూట కూడా పనికిమాలిన ప్రశ్నలు ఎందుకు అడుగుతారు అనుకుంటూ వెళ్లిపోయారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది