Ys Jagan : జగన్‌లో మార్పు రాకపోతే తాడేపల్లిగూడెంకే ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది..!
Ys Jagan : గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఆయన పర్యటనలు వరుసగా రద్దు అవుతున్నాయి.చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ హత్యకు గురైన అస్ఫియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గత నెల 27న తిరుమల రావాలనుకున్నారు. కాలినడకన స్వామి […]
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్‌లో మార్పు రాకపోతే తాడేపల్లిగూడెంకే ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది..!
Ys Jagan : గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఆయన పర్యటనలు వరుసగా రద్దు అవుతున్నాయి.చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ హత్యకు గురైన అస్ఫియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గత నెల 27న తిరుమల రావాలనుకున్నారు. కాలినడకన స్వామి వారిని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే జగన్ పర్యటన పట్ల కూటమి నేతలు నిరసనలు తెలిపారు. హిందూ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఒక విధంగా కొంత ఉద్రిక్తత అయితే తిరుపతిలో ఏర్పడింది. సెక్షన్ 30ని అమలు చేశారు.
Ys Jagan ఏందయ్యా.. జగన్ ఇది..!
దాంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే జగన్ రాజకీయంగా ఇక్కడే తప్పు చేశారు అని అంటున్నారు. జగన్ పుంగనూరు పర్యటన వల్ల అక్కడ జరిగిన ఏడేళ్ల బాలిక అస్ఫియా దారుణ హత్య రాష్ట్రం మొత్తం తెలిస్తుందని, దాని వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో మంత్రులు పుంగనూరుకు వచ్చారని వైసీపీ నాయకులు విమర్శించారు. బాలిక హత్య జరిగింది అన్నది తెలిసిన వెంటనే జగన్ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదారిస్తే వైసీపీ చిత్తశుద్ధి బయటపడేది అని అంటున్నారు. మంత్రులు వచ్చి వెళ్ళినా ఒక ప్రతిపక్ష నేతగా జగన్ పరామర్శించి ఉంటే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. ఇక పుంగనూరు లో కూడా జగన్ టూర్ సందర్భంగా ఉద్రిక్తతలకు ఆస్కారం ఉంటుందని ఆయన రాక ముందు ఆంక్షలు పెడతారని కూడా ప్రచారం సాగింది.
ఒకప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు జగన్.. తన దగ్గరకు సాటి ఎంపీలు ఎవర్నీ రానిచ్చేవారు కాదు. ఏపీ సీఎం అయ్యాక కూడా అదే తీరు ప్రదర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎవరికీ స్వేచ్ఛ ఇవ్వలేదు. నిర్ణయాలన్నీ తానే తీసుకున్నారు. పథకాలన్నీ బటన్ల ద్వారానే రిలీజ్ చేశారు. చేతిలో అధికారం లేని వాలంటీర్ల ద్వారానే పని కానిచ్చారు. వాళ్లైతే ఎదురు తిరగలేరనే ఉద్దేశంతో జగన్ వారి సేవల్ని మాత్రమే ఉపయోగించుకున్నారు. ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల మధ్య మార్చేశారు. ఆయనలో ఉన్న ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ వల్లే ఇలా చేశారనే టాక్ ఉంది.ఆయన తీరుతో వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి దానికీ జగన్.. నిరాశావాదాన్నే చూపిస్తూ, దిగాలుగా కనిపిస్తూ ఉండటం వల్ల.. వైసీపీలో నైరాశ్యం పెరిగిపోతోందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.