Yanamala Rama Krishnudu : ఏంటి యనమల రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారా..!
Yanamala Rama Krishnudu : టీడీపీ TDP ఆవిర్భావం నుంచి సేవలు అందించిన వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు Yanamala Rama Krishnudu కూడా ఉన్నారు. ఆయన మంత్రిగానూ ఆయన విశేష సేవలు అందించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తి అవుతుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటనే దానిపై సందిగ్ధం నెలకొంది.
Yanamala Rama Krishnudu : క్లారిటీ ఇచ్చేశారు..
యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ప్రస్తుతం యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా, అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీల ఖరారు వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తుందీ యనమలకు వివరించారు.

Yanamala Rama Krishnudu : ఏంటి యనమల రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారా..!
ఈ నేపథ్యంలో భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతూ.. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. నిన్న శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం చంద్రబాబు తనతో మాట్లాడారని, ఫలానా వారిని ఎంపిక చేశామని చెబితే స్వాగతించానని చెప్పారు. రెండుసార్లు తనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పినట్టు పేర్కొన్నారు.