Vijayasai Reddy : నన్ను గెలికితే నీకే నష్టం అంటూ జగన్ కు విజయసాయి వార్నింగ్
Vijayasai Reddy : వైసీపీ పార్టీలో నాయకత్వంలో వివాదాలు రోజు రోజుకు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక సుదీర్ఘ ట్వీట్ ద్వారా తన మనసులో మాట బయటపెట్టారు. పార్టీకి తన సేవలు చేసిన తనలాంటి నాయకుడిని అనవసరంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ఇది చివరికి జగన్ కే నష్టంగా మారుతుందని హెచ్చరించారు. తాను రాజకీయంగా స్వేచ్ఛావంతుడిని అని పేర్కొంటూ, వ్యక్తిగత పరిచయంతోనే టీడీపీ నేత ఆదిశేషగిరిరావును కలిశానని స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశాన్ని టీడీపీలో చేరేందుకు మొదటి అడుగు అనే అర్థం చేసుకోవడం పొరపాటని, తాను ఈ జన్మలో టీడీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Vijayasai Reddy : నన్ను గెలికితే నీకే నష్టం అంటూ జగన్ కు విజయసాయి వార్నింగ్
Vijayasai Reddy : జన్మలో టీడీపీ లో చేరే ప్రసక్తే లేదు – మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
వైసీపీ లోని కొందరు నేతలు లిక్కర్ స్కాం వంటి విషయాల్లో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. జగన్ ఒకవైపు అలాంటి స్కాంలు లేవని చెబుతుండగా, ఆయన కోటరీ మాత్రం ఇదే అంశంపై తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. గతంలో తనపై నమోదైన కేసుల్లోనూ తాను నిష్కల్మషుడిగా ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈరోజు కూడా జగన్ కోసం ఏమైనా భరించడానికి సిద్ధమని చెప్పారు కానీ కోటరీ అజ్ఞానంతో కేసులు మోపితే ఎందుకు భరించాలో ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి విజయసాయిరెడ్డి ఈ వివాదంలో జగన్ పై సాఫ్ట్ కార్నర్ ఉంచినా, ఆయన చుట్టూ ఉన్న కోటరీని తీవ్రంగా విమర్శించారు. జగన్ నమ్మే వ్యక్తుల అనుభవలేమి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తనను కెలకడం ద్వారా రాజకీయ లాభం ఏమి రాదని, తానొక పొలిటికల్ ఫ్రీ బర్డ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ నుంచి దూరంగా ఉన్న ఆయనను మరింతగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే, దాని ప్రభావం ప్రత్యక్షంగా జగన్ పై పడుతుందన్న హెచ్చరికను ఆయన ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ స్వయంగా జోక్యం చేసుకుని పార్టీ లోని ఈ అంతర్గత కలహాలను ఆపుతారా? లేక పరిస్థితులు మరింత వేడెక్కుతాయా? అన్నదే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.