Sikkolu : సిక్కోలులో ధర్మాన ప్రసాదరావు కు గట్టి పోటీ..!
ప్రధానాంశాలు:
Sikkolu : సిక్కోలులో ధర్మాన ప్రసాదరావు కు గట్టి పోటీ..!
Sikkolu : శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ప్రజలు ఏదైనా ఒకే పార్టీకి పట్టం కడతారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం సిక్కోలు లో పరిస్థితి మరింత భిన్నం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో ఆయన మూడుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన 5 వేల మెజారిటీతో గెలిచారు. జనసేనకి ఏడున్నర వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చబట్టి ధర్మాన ముందు పడ్డారు. లేదంటే వరుసగా రెండోసారి ఓడిపోయేవారు. తర్వాత మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేయడం ఖాయం. కానీ ఆయన ఇటీవల కాలంలో పెద్దగా ఆత్మవిశ్వాసం లేని రాజకీయాలు చేస్తున్నారు. ఇక ఈసారి తన కుమారుడికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. సిక్కోలులో పోటీ చేయను అంటే కొత్త అభ్యర్థిని చూసుకుంటానని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ కు పోటి చేయమని ఆఫర్ ఇచ్చినా వద్దని ధర్మాన చెప్పేశారు. దీంతో ఆయనకు టికెట్ నిరాకరించడం లేదా మార్పు చేయడం ఉండకపోవచ్చు. కొన్ని సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ధర్మాన విఫలం అయ్యారు. నగరంలో కలింగ కోమట్లు తనకు ఎప్పుడు పూర్తిస్థాయిలో ఓట్లు వేయడం లేదని భావించిన ధర్మాన ఇటీవలే వారి మనసు గెలుచుకోవాలని ప్రయత్నించారు కానీ అవి రివర్స్ అయ్యాయి.
అదే సమయంలో ఎన్నికల ముందు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కళింగ కోమట్లకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శలు ఉన్నాయి. 2019లో ధర్మాన గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కనంతవరకు ఆయన మీద ప్రజలకు సానుభూతి ఉండేది. ప్రస్తుతం అది కనిపించడం లేదు. 2024లో ఆయన గెలిచే ప్రసక్తి లేదని భావించారో ఏమో అందరినీ దూరం పెడుతూ వస్తున్నారు. ఆయన వ్యవహార శైలిని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక ఇక్కడ టీడీపీ తరపున ఉండాల లక్ష్మి పోటీ చేయనున్నారు. టీడీపీ, జనసేన పొత్తు వలన ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. జనసేనకి ఈ నియోజకవర్గం లో పెద్దగా గుర్తింపు లేకపోయినా వచ్చే ఆరు ఏడు ఓట్లు కూడా చీల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మాన ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొంది.