Dharmana Prasada Rao : ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇవ్వకుంటే పరేషానే?
Dharmana Prasada Rao : ధర్మాన ప్రసాదరావు.. ఏపీ రాజకీయాల్లో ఆయన కీలకనేత. గతంలో మంత్రిగా సేవలందించిన ఆయన.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీ పదేండ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో శ్రీకాకులంలో ధర్మాన ప్రసాదరావుకు ఎదరు లేదనే చెప్పాలి. తర్వాతి కాలంలో 2014 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అనంతరం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సమయంలో తన మంత్రి వర్గంలో యంగ్ లీడర్లకే జగన్ ప్రాధాన్యం ఇవ్వడంతో ధర్మానకు కాస్తి ఇబ్బందికరంగా మారింది.
Dharmana prasada rao : కేబినెట్ లో ప్లేస్ కోసమై సైలెంట్?
అయితే ఇటీవలే వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ చేపడతారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. మంత్రి పదవి ఆశించే వారి సంఖ్య సైతం పెరిగింది. వీరిలో ధర్మాన ప్రసాదరావు సైతం ఒకరనే చెప్పాలి. ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న ఆయన.. జగన్ కేబినెట్ విస్తరణ అనంతరం తన వైఖరిని బయటపెట్టే చాన్స్ ఉంది. కేబినెట్‌లో తప్పనిసరిగా తనకు బెర్త్ కన్ఫార్మ అవుతుందని ఆయన భావిస్తున్నారు. మొదటి విడత కేబినెట్‌లోనే అతడికి పదవి దక్కాల్సి ఉన్నా.. ఆయన సోదరుడికి పదవి దక్కడంతో సరిపెట్టుకున్నారు ధర్మాన.
ప్రస్తుతం మరోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుండటంతో తనకు తప్పుకుండా అందులో చాన్స్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకేనేమో ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్‌లో ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం మీద అసంతృప్తితో ఉన్న ఆయన.. ప్రస్తుతం చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో పదవి దక్కకుంటే వాయిస్ పెంచే చాన్స్ ఉందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. బయట నుంచి వచ్చిన వారు పార్టీని శాసించడం ఏంటని పలు సందర్భాలలో ఆయన అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి కేబినెట్ లో ఆయనకు చోట దక్కుతుందో లేదో చూడాలి మరి.