YV Subbareddy : తిరుమల లడ్డూ వివాదం.. వైవి సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించట్లేదు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YV Subbareddy : తిరుమల లడ్డూ వివాదం.. వైవి సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించట్లేదు..?

YV Subbareddy : తిరుమల లడ్డూ వివాం జాతీయ స్థాయి చర్చకు దారి తీసింది. అందరు వైసీపీనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఐతే జగన్ ఈ డ్యామేజ్ ని కాస్త తగ్గించాలని తిరుమల వెళ్దామని అనుకుంటే ఆ పర్యటన కాస్త రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వంపై సీమె చంద్రబాబు పై జగన్ మండిపడ్డారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన కరుణాకర రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తను చెప్పాల్సింది చెప్పారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 September 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  YV Subbareddy : తిరుమల లడ్డూ వివాదం.. వైవి సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించట్లేదు..?

YV Subbareddy : తిరుమల లడ్డూ వివాం జాతీయ స్థాయి చర్చకు దారి తీసింది. అందరు వైసీపీనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఐతే జగన్ ఈ డ్యామేజ్ ని కాస్త తగ్గించాలని తిరుమల వెళ్దామని అనుకుంటే ఆ పర్యటన కాస్త రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వంపై సీమె చంద్రబాబు పై జగన్ మండిపడ్డారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన కరుణాకర రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తను చెప్పాల్సింది చెప్పారు. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు.

ఈ టైం లో జగన్ బాబాయ్ తొలి నాలుగేళ్లు టీటీడీ కు చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించలేదు. లడ్డూ ఇష్యూపై ఇప్పటివరకు సుబ్బారెడ్డి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఖండించలేదు. ఆయన హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి టైం లో ఆయన జగన్ వెంట ఉండకుండా ఏం చేస్తున్నారని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు. జగన్ తిరుమల పర్యటన రద్దయ్యాక కూడా సుబ్బారెడ్డి మీడియా ముందుకు రాకపోవాంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.

YV Subbareddy నాలుగేళ్లు టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి..

వైసీపీ హయాంలో నాలుగేళ్లు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి. రాజకీయ కారణాల వల్ల చివరి సంవత్సరం కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఐతే తాజా వివాదం వల్ల వైవీ సుబ్బారెడ్డిని కార్నర్ చేస్తున్నారు. ఆయన స్పందించక పోవడం వల్ల ఇంకా ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. అయితే మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాత్ర్మ్ తన హయాంలో తప్పు జరగలేదని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

YV Subbareddy తిరుమల లడ్డూ వివాదం వైవి సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించట్లేదు

YV Subbareddy : తిరుమల లడ్డూ వివాదం.. వైవి సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించట్లేదు..?

లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి ఒక్కసారే మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత కనిపించలేదు. నెయ్యిలో కల్తీ జరగలేద్దని ఆయన కచ్చితంగా చెప్పలేకపోవడం వైసీపీకి మైనస్ గా మారుతుంది. వైవీ సుబ్బరెడ్డి ఫుల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రజలు ఒక క్లారిటీకి వస్తారు. మరి ఈ విషయంపై సుబ్బారెడ్డి ఏం ఆలోచిస్తున్నారు వైసీపీకి ఇంత డ్యామేజ్ జరుగుతున్నా ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది