Vasireddy Padma : వైసీపీకి గుడ్ బై చెప్పాక జగన్‌పై కడుపులో ఉందతా కక్కేసిన వాసిరెడ్డి పద్మ
Vasireddy Padma : వైసీపీ అధినేత జగన్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన నాయకులు.ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇలా ఒక్కొక్కరుగా రాజీనామా చేశారు. తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీని వీడారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధినేత జగన్‌కు లేఖ రాశారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వాసిరెడ్డి పద్మ ఎక్కడా పెద్దగా కనిపించలేదు.. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. కేడర్ ను ఏ మాత్రం జగన్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎవరూ జగన్ పక్క ఉండే పరిస్థితి లేదన్నారు. తనకు అనేక అవమానాలు జరిగాయన్నారు.
Vasireddy Padma జగన్ పై ఆగ్రహావేశం..
వాసిరెడ్డి పద్మ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సీటు ఆశించారు.. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో.. నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి ఇస్తారని భావించారట.. అయితే ఇటీవల పార్టీ అధినేత వైఎస్ జగన్ తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని నడిపించడంలో జగన్ కి బాధ్యత లేదని.. పరిపాలన చేయడంలోనూ బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని విమర్శించారు.
వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీలో పనిచేసినట్లు తెలిపారు. అయితే… ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలను సమీక్షించుకుని, అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఇటీవల ప్రస్థావించిన “గుడ్ బుక్”పై సెటైర్లు పేల్చారు వాసిరెడ్డి పద్మ! ఇందులో భాగంగా… నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది “గుడ్ బుక్” కాదని, “గుండె బుక్” అని పద్మ కామెంట్ చేశారు. ఇదే సమయంలో.. ప్రమోషన్ అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదని.. పార్టీకోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్ “గుడ్ బుక్” పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఫుల్ ఫైర్ అయ్యారు.