Srinivas Rao VS Malladi Vishnu : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ కన్ఫమ్ చేయని జగన్.. కారణం అదేనా?
Srinivas Rao VS Malladi Vishnu : ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా ఎన్నికల సమయం రానేలేదు కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అయితే త్వరలోనే తమ అభ్యర్థుల లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ కూడా తలూపారు. కొందరికి జగన్ నుంచి స్పష్టమైన హామీ కూడా లభించింది. కొందరి విషయంలో మాత్రం జగన్ ఆచీతూచీ అడుగేస్తున్నారు. కొందరికి ఇంకా టికెట్స్ కన్ఫమ్ చేయలేదు.
అందులో విజయవాడకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు. వాళ్లను ఎందుకు అధిష్ఠానం హోల్డ్ లో పెట్టిందో అర్థం కావడం లేదు. ఇప్పటికే వైసీపీ ఐటీ విభాగం అభ్యర్థుల లిస్టును తయారు చేసిందట. అందులో 85 శాతం మంది సిట్టింగులే. మరి మిగిలిన 15 శాతం మంది ఎవరు అంటే వాళ్లు కొత్త వాళ్లే. కాకపోతే నియోజకవర్గంలో అంతో ఇంతో ప్రజాబలం ఉన్నవాళ్లే అని చెప్పుకోవాలి. ఇక.. విజయవాడ విషయానికి వస్తే.. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్.. ఈ రెండు స్థానాల్లో వైసీపీనే గెలిచింది. అయినా కూడా వాళ్లను టికెట్స్ ఇచ్చేందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారు.
Srinivas Rao VS Malladi Vishnu : ప్రజల్లో వాళ్లకు సానుభూతి కరువైందా?
అసలు ఏం జరుగుతోంది అనేది చెప్పలేం కానీ.. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్స్ ఇవ్వకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం.. ప్రజల్లో వీళ్లకు సానుభూతి కరువైందట. అందుకే ఈసారి టికెట్ ఇచ్చినా వాళ్లు ఓడిపోతారు అని వైసీపీ ఐటీ విభాగం అంచనా వేసిందట. ఈ ఇద్దరిని హోల్డ్ లో పెట్టడం వల్ల అసలు విజయవాడ వైసీపీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. మరి వాళ్లను పక్కన పెట్టి ఎవరికి టికెట్ ఇస్తారు. అక్కడ ఆల్టర్నేట్ గా వైసీపీ నాయకులు కూడా లేరు. అయినా కూడా వాళ్లకు కాకుండా ఎవరైనా ప్రజాబలం ఉన్న నాయకుల కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించినట్టు తెలుస్తోంది.