Venkat Reddy : వెంక‌ట‌రెడ్డి స్కామ్ మాముల‌గా లేదుగా.. ఏకంగా 800 కోట్లు స్వాహ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venkat Reddy : వెంక‌ట‌రెడ్డి స్కామ్ మాముల‌గా లేదుగా.. ఏకంగా 800 కోట్లు స్వాహ‌

 Authored By ramu | The Telugu News | Updated on :26 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Venkat Reddy : వెంక‌ట‌రెడ్డి స్కామ్ మాముల‌గా లేదుగా.. ఏకంగా 800 కోట్లు స్వాహ‌

Venkat Reddy : ఏపీలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు చాలా జ‌రిగాయి అని అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద ఏసీబీ అనుమతి తీసుకుంది. ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. వెంకట రెడ్డి ఆచూకీ కోసం మాతృశాఖ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ కూడా రాసింది..

Venkat Reddy ప‌క్కా ప్లాన్‌తో..

తమకు వెంకట రెడ్డి ఆచూకీ తెలియదని ప్రభుత్వానికి కోస్ట్ గార్డ్ సంస్థ సమాధానం ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన వెంకటరెడ్డి అరెస్టు భయంతో ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు అంటున్నారు.

Venkat Reddy వెంక‌ట‌రెడ్డి స్కామ్ మాముల‌గా లేదుగా ఏకంగా 800 కోట్లు స్వాహ‌

Venkat Reddy : వెంక‌ట‌రెడ్డి స్కామ్ మాముల‌గా లేదుగా.. ఏకంగా 800 కోట్లు స్వాహ‌

గనుల లీజుల కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో ఆయన పలు నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రభుత్వానికి రూ.800 కోట్లు బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఆయన ఎన్‌వోసీ ఎలా జారీ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారనే వివరాలను సేకరిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థల ఉల్లంఘనల్లోనూ ప్రమేయం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీల్లో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్ల సమర్పణ తదితర అంశాలపై అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక విచారణ కొనసాగిస్తోంది. సస్పెన్షన్‌ నోటీసులు అందజేయడానికి గనుల అధికారులు వెళ్లినా సరే ఆయన నివసించే చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై కూడా ఏసీబీ గురిపెట్టింది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది