Pawan Kalyan : ఇదెక్కడి రాజకీయం సామీ.. పవనూ నువ్వు CM కాదు కదా ఎమ్మెల్యే కూడా కష్టమే ఇలా చేస్తే !
Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం మాత్రమే సమయం ఉంది. కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్న లెక్క వేరు. అసలు ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు.. అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన పొత్తుల్లో ఉన్నారా? లేరా? సొంతంగా పోటీ చేస్తున్నారా? అస్సలు ఏం అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ లాజిక్ ఎవ్వరికీ అర్థం కాదు. ఆయన లెక్కలను ఎవ్వరూ నమ్మడం లేదు. ఒకసారి బీజేపీ అంటారు.. మరోసారి టీడీపీ అంటారు. పొత్తులు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందా? పొత్తులు లేని పార్టీ వేస్టా.. ఇదిగో ఇలా ఉంటున్నాయి పవన్ కళ్యాణ్ లాజిక్కులు.
అసలు ఈయన లాజిక్కు ఏంటో జనసైనికులకే అర్థం కావడం లేదు. అసలు ఆయనకు రాజకీయ అవగాహన ఉందా? లేదా?. ఆయనే ఏదైనా ఇబ్బంది పడుతున్నారా? అసలు ఆయనకు ఏం అర్థం కావడం లేదా అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. పొత్తులు లేకుండా ఏ పార్టీ అయినా గెలిచిన చరిత్ర ఉందా. పొత్తులు పెట్టుకొని అటూ ఇటూ కాకుండా పోయిన పార్టీలు కూడా బోలెడు ఉన్నాయి.
Pawan Kalyan : పొత్తుల వల్లనే పార్టీ బలోపేతం అవుతుందా?
పొత్తుల వల్లనే పార్టీ బలోపేతం అవుతుందని ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందుకు నిదర్శనమే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అంటూ చెప్పుకొచ్చారు పవన్. ఆ రెండు పార్టీలు పొత్తుల వల్లనే బలోపేతం అయ్యాయట. ఆ తర్వాతనే అధికారంలోకి వచ్చాయట. ఇదేం పిచ్చి లాజిక్ పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీతో జతకట్టింది కానీ.. ఇప్పుడు ఎలాంటి పొత్తులు లేకుండానే అధికారంలో ఉంది కదా అనే కొత్త వాదనను తీసుకొచ్చారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ సంగతి ఏంటి. ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కదా. ఒంటరిగానే పోటీ చేసింది కదా. ఇప్పుడు అధికారంలో ఉంది కదా అంటూ పవన్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజమే కానీ.. చూద్దాం మరి అసలు పవన్ పొత్తులు ఎంత దూరం వెళ్తాయో?