Pithapuram Voters : పిఠాపురం ఓటర్ల రూటు ఎటు.. ఎందుకీ సైలెన్స్..?
ప్రధానాంశాలు:
Pithapuram Voters : పిఠాపురం ఓటర్ల రూటు ఎటు.. ఎందుకీ సైలెన్స్..?
Pithapuram Voters : ఇప్పుడు ఏపీలో అందరి చూపు పిఠాపురం మీదనే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. దాంతో అందరి చూపు దీనిమీద పడింది. ఇక్కడ ఆయన గెలుస్తారా లేదా అనేది అందరిలోనూ ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు. ఈ సారి పిఠాపురానికి మారారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ సారి ఓడితే మాత్రం ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదనే చెప్పుకోవాలి. ఇక ఆయనకు పోటీగా వైసీపీ నుంచి వంగ గీత బరిలో ఉన్నారు.
Pithapuram Voters : రంగంలోకి జబర్దస్త్ టీమ్..
ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. పవన్ కల్యాణ్ మీద ఆమె ధీటైన విమర్శలు, కౌంటర్లతో ఎటాక్ చేస్తున్నారు. ఆమె రీసెంట్ గా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చాలా పెద్ద స్టార్ హీరో కదా.. మరి అలాంటి స్టార్ కు పక్కన ఇంకెంత మంది స్టార్లు అవసరం అని ఆమె వ్యంగ్యంగా కౌంటర్ వేశారు. పవన్ కల్యాణ్ తరఫున ఇప్పుడు జబర్దస్త్ టీమ్ మొత్తం ప్రచారం చేస్తోంది. వారంతా ఇప్పటికే పిఠాపురంలో గల్లీ గల్లీ తిరిగేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు నిజంగానే లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందనుకుంటే.. ఇంతగా ప్రచారం చేయడం ఎందుకు అని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. అటు జబర్దస్త్ టీమ్ ఏం చెబుతోంది అంటే.. తాము వచ్చినా రాకపోయినా పవన్ కల్యాణ్ కు మాత్రం లక్ష ఓట్ల మెజార్టీ ఖాయం అని.. కాకపోతే తమ ప్రేమ కొద్దీ ప్రచారం చేస్తున్నామని చెప్పుకుంటోంది. పవన్ కల్యాన్ ను ఓడించేందుకు వైసీపీ కూడా భారీగానే వ్యూహాలు రచిస్తోంది.
ఇప్పటికే మిధునిరెడ్డి పిఠాపురంలో మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. అటు కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా తన నియోజకవర్గం వదిలేసి మరీ పిఠాపురంలో తిరుగుతున్నారు. వంగా గీతను గెలిపించాలంటూ అందరినీ కోరుతున్నారు. అటు ముద్రగడ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కాపులతో ఆత్మీయ సమావేశాలు పెడుతూ పవన్ ను ఓడించేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పిఠాపురం ఓటర్లు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. తమ ఓటు ఎవరికి అనేది మాత్రం తేల్చుకోలేకపోతున్నారు