Pawan Kalyan : పొరపాటున కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురాని బీజేపీ పెద్దలు.. పిచ్చ లైట్ తీసుకున్నారుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : పొరపాటున కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురాని బీజేపీ పెద్దలు.. పిచ్చ లైట్ తీసుకున్నారుగా

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయాత్తం అవుతున్నాయి. నిజానికి ఏపీలో పొత్తుల కోసం చాలా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఏపీలో పొత్తు అంటే టీడీపీ, జనసేన మాత్రమే ముందు గుర్తొస్తాయి. ఆ తర్వాత బీజేపీ గుర్తొస్తుంది. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ అది ఏదో పేరుకే. ఎందుకంటే.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్టుగా ఎలాంటి కార్యక్రమాలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :13 June 2023,9:00 am

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయాత్తం అవుతున్నాయి. నిజానికి ఏపీలో పొత్తుల కోసం చాలా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఏపీలో పొత్తు అంటే టీడీపీ, జనసేన మాత్రమే ముందు గుర్తొస్తాయి. ఆ తర్వాత బీజేపీ గుర్తొస్తుంది. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ అది ఏదో పేరుకే. ఎందుకంటే.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్టుగా ఎలాంటి కార్యక్రమాలు కూడా జరగడం లేదు. ఎవరి పార్టీ వాళ్లదే అన్నట్టుగా రెండు పార్టీలు వేర్వేరుగా తమ పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాయి.

అయితే.. ఎన్నికల వరకు బీజేపీ, జనసేన పొత్తు కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది అనుమానమే. ఇప్పుడయితే పొత్తు ఉంది కానీ.. పొత్తు కంటిన్యూ అయ్యేది డౌటే. ఇక టీడీపీ, జనసేన పొత్తు అయితే కన్ఫమ్ అయినట్టే. ఎందుకంటే.. టీడీపీ పార్టీ జనసేన రెండు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉన్నాయి. కానీ.. టీడీపీకి జనసేన కంటే కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని ఉత్సుకత ఉంది. అందుకే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మంతనాలు జరిపారు. కానీ.. అది పెద్దగా వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు.

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan : జనసేన గురించి మాట్లాడని బీజేపీ

బీజేపీతో జనసేన పార్టీ పొత్తు ఉంది కానీ.. శ్రీకాళహస్తి మీటింగ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అసలు జనసేన గురించే మాట్లాడలేదు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కానీ.. ఎందుకు తమ మిత్రపక్షం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ నేతలంతా కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ.. వైసీపీ పాలనపై ఎక్కు పెట్టారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. జనసేనతో పొత్తు విషయాన్ని ఎందుకు బీజేపీ మరిచిపోయింది అనేదానిపై అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రూటు ఎటు. ఏపీలో జనసేనతో కాకపోతే మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా.. లేక మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా.. అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది