YCP : పార్టీ నడపటం కష్టం.. వైసీపీలో నాయకుల అంతర్మధనం..!
ప్రధానాంశాలు:
YCP : పార్టీ నడపటం కష్టం.. వైసీపీలో నాయకుల అంతర్మధనం..!
YCP : పార్టీ అధికారంలో ఉంటే సీఎం స్థాయి కేడర్ నుంచి విలేజ్ లో ఉన్న చిన్న కార్యకర్త వరకు అదో ధైర్యంగా ఉంటుంది. అధికారం లో ఉన్న పార్టీ జెండా మోసే కార్య కర్త కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అనుకుంటాడు. ఐతే ప్రతి పక్షంలో ఉంటే మాత్రం అది రివర్స్ అవుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్టు ఉంది. కూటమి వచ్చి చేస్తున్న పనుల వల్ల ప్రజలు ఏమంత హ్యాపీగా లేరన్నట్టు వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇదిలాఉంటే అధికారంలో లేని వైసీపీ నుంచి నేతలంగా కూడా పార్టీ మారేందుకుందు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీకి రిజైన్ చేయగా ఆ లిస్ట్ లో మరికొందరు ఉన్నారు. ఐతే పార్టీలో ముఖ్య నేతలంతా కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీ పార్టీ మారుతున్నారని వచ్చిన వారిలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఒకరు ఉన్నారు. ఐతే తాను మాత్రం పార్టీ మారట్లేదని కచ్చితంగా చెప్పేస్తున్నారు.
YCP ప్రతిపక్షంలో ఉంటే పనులు కావని..
ఐతే ఆయన ప్రజెంట్ రాజకీయాల గురించి తనదైన స్టైల్ లో కామెంట్ చేశారు. రాజకీయాల్లో ఉన్న వారు వ్యక్తిగత అజెండాలనేవి ఉండకూడదు. ఇక్కడ సెల్ఫిష్ నెస్ తగ్గించుకోవాలని అన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది పక్కన పెడితే పార్టీ మారే నాయకుల పక్షాన ఆయన వ్యరితేకంగా ఉన్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే వారంతా కోరికలతో వస్తున్నారు తప్ప మరొకటి లేదని. పార్టీలను నడిపించడం కష్టం అవుతుందని ఆయన చెప్పారు.
పార్టీలు నాయకుల క్యాడర్ ని అందరినీ ఒక తాటిపై తీసుకు రావాలంటే పెద్ద టాస్క్ గా మారింది. ఏ పార్టీ అధికారం లో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా అందరి కోరికలు తీర్చడం కష్టమని అన్నారు ఆళ్ల రామిరెడ్డి. అధికారం లో ఉంటే ఇవాళ కాకపోతే రేపు అన్నట్టు ఉంటుంది కానీ ప్రతి పక్షంలో అలాంటి ఛాన్స్ ఉండదని ఆయన అన్నారు. అధికారంలో లేనప్పుడు పార్టీని నడపడం కష్టం కాబట్టే ఈ జంపింగులు ఉంటాయని ఆయన అన్నారు.