Tammineni Seetharam : తిరుమల లడ్డూ వివాదం ఆవుది తప్పన్న తమ్మినేని.. వైసీపీకి భారీ డ్యామేజ్..!
ప్రధానాంశాలు:
Tammineni Seetharam : తిరుమల లడ్డూ వివాదం ఆవుది తప్పన్న తమ్మినేని.. వైసీపీకి భారీ డ్యామేజ్..!
Tammineni Seetharam : ఏపీలో తిరుమల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చల్లో నిలుస్తుంది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ వారి హయాంలోనే ఇది జరిగిందని కూటమి ఎటాక్ చేస్తుంటే నష్ట నివారణ గా వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా కూటమి పాలన డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు సీబీఐ తో విచారణ జరిపించాలని కోరుతున్నారు.
ఐతే ఈ వ్యవహారం అంతా టీటీడీ చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఉన్నప్పుడే జరిగిందని కూటమి చెబుతుంది. అది తప్పుడు ప్రచారం అని ల్టెస్ట్ గా మాజీ మంత్రి కొడాలి నాని, తమ్మినేని సీతారామం కూడా స్పందించారు. కొడాలి నాని ఎప్పటిలా బూతులు కాకుండా కూల్ గానే తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ఐతే స్పెకార్ ఆ పనిచేసిన అమ్మినేని మాత్రం అభ్యంతరకరంగా మాట్లాడారు.
Tammineni Seetharam ఆవు మీద అభియోగం..
తమ్మినేని మాట్లాడుతూ.. నెయ్యి లో జంతువుల కొవ్వు ఉండటం అనేది జరగదని.. ఒకేవెళ ఆవు వల్ల ఆ నెయ్యి అలా తయారై ఉండొచ్చని కొత్త పాయింట్ లేవనెత్తారు. ఆవాలు, పామాలీవ్ ఆకులు తినే ఆవు పాలు కల్తీ అవుతాయని అన్నారు.. సో ఆయన మాటలను బట్టి చూస్తే ఆవు పాల వల్లే నెయ్యి కల్తీ అయినట్టు చెబుతున్నారు. అసలు ఆవు ఎలా తన పాలని కల్తీ చేస్తుంది అంటూ కొత్త వాదన మొదలైంది. దీనితో తమ్మినేని మీద నెటిజెన్లు ఎటాక్ చేస్తున్నారు.
తమ్మినేని వ్యాఖ్యల వల్ల వైసీపీ మరింత ఇరకాటం లో పడినట్టు అయ్యింది. జరిగిన ఇన్సిడెంట్ చాలా సెన్సిటివ్ ఇంకా సీరియస్ మ్యాటర్ అలాంటిది. తమ్మినేని అలా ఎలా ఆవు వల్ల నెయ్యి కల్తీ అవుతుందని అంటారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నష్ట నివారణ చర్యలు కాకుండా ఇలా తల తోక లేకుండా మాట్లాడి అనవసరంగా కార్నర్ అవుతున్నారని చెప్పొచ్చు. దీనిపై వైసీపీ గట్టి స్టాండ్ తీసుకుంటే తప్ప తిరుమల లడ్డు వివాదం వైసీపీ పై గట్టి ఎఫెక్ట్ చూపించేలా ఉంది.