Ys Sharmila : అప్పుడు దయ్యంలా కనిపించిన సోనియా ఇప్పుడు దేవతలా ఎలా కనిపిస్తుంది షర్మిలమ్మా…?
Ys Sharmila : అధ్యక్షురాలు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై వైయస్ అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల సోనియాగాంధీతో షర్మిల చర్చలు జరపడం తెలిసిందే. దీంతో త్వరలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మిల YSRTP పార్టీని.. కాంగ్రెస్ లోకి విలీనం చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఇదంతా పక్కన పెడితే ఆనాడు వైఎస్ జగన్ పై పెట్టిన కేసుల విషయంలో వైఎస్ పేరును కూడా సీబీఐ చార్జి షీటులో చేర్చడం జరిగింది. ఈ పరిణామంపై వైయస్ కుటుంబం ఎంతో అసహనం చెందారు. కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన వైయస్ నీ ఈ రీతిగా అవమానిస్తారా అంటూ ప్రజల్లోకి..సీబీఐ చార్జి షీటులో చేర్చడాన్ని తప్పుపట్టారు.
పరిస్థితి ఇలా ఉంటే అటువంటి మహా నాయకుడు వైయస్ అభిమానించే వాళ్ళు సైతం.. కాంగ్రెస్ పై ఎంతో అసహనం చెందారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మొత్తం తలకిందులయ్యాయి. మేటర్ లోకి వెళ్తే ఆనాడు వయసు కుటుంబాన్ని అవమానించిన సోనియాగాంధీని.. తాజాగా షర్మిలా వెనకేసుకొచ్చింది. తమ కుటుంబానికి సంబంధించి సోనియాగాంధీ ఎలాంటి ద్రోహం చేయలేదని పంజాగుట్టలోని వైయస్ విగ్రహం సాక్షిగా షర్మిల ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి వైయస్ లేని లోటును ఎవరు పోల్చలేదని తాను సోనియాతో కూర్చున్న చర్చలలో ఆమె హృదయపూర్వకంగా చెప్పినట్లు వ్యాఖ్యానించారు.
దీంతో నాడు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన షర్మిల యేనా మాట్లాడేది అంటూ వైఎస్ ప్రేమించే కార్యకర్తలు అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత అన్నయ్యని జైల్లో పెట్టించి, తండ్రి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన సోనియాతో షర్మిల కలవడం నిజంగా సిగ్గుచేటు అంటూ వైఎస్ అభిమానించేవారు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.