Ys Jagan : పేదలకు గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలు అందించనున్న ప్రభుత్వం..!
Ys Jagan : పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. దీని ద్వారా పేదలకు ఒక్కొక్కరికి 2.70 లక్షలు ఇస్తున్నారు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయడం కోసం ఆయన ‘ నవరత్నాలు ప్రజలందరికీ ఇల్లు పథకం ‘ తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ […]
ప్రధానాంశాలు:
Ys Jagan : పేదలకు గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలు అందించనున్న ప్రభుత్వం..!
Ys Jagan : పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. దీని ద్వారా పేదలకు ఒక్కొక్కరికి 2.70 లక్షలు ఇస్తున్నారు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయడం కోసం ఆయన ‘ నవరత్నాలు ప్రజలందరికీ ఇల్లు పథకం ‘ తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అంతేకాక వారు ఆ జాగాలో ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఏపీ ప్రభుత్వం వారికి లక్షల్లో ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే లక్షల మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం త్వరలోనే మరి కొంతమందికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీలోనే మరో 2,32,686 ఇల్లు నిర్మించడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు లే అవుట్ లలో నీరు, విద్యుత్ సరఫ,రా ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి శరవేగంగా పనులను పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
వీటిలో 1913 లక్షలు సాధారణ ఇల్లు కాగా మిగిలినవి టిడ్కో ఇల్లు. సాధారణ ఇళ్ళలో ఇప్పటికే 7.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 4.15 లక్షల ఇళ్ల నిర్మాణం పునాది నుంచి రూఫ్ లెవెల్ వరకు వివిధ దశలు ఉన్నాయి. వైయస్ జగన్ ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్ కు 1.80 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అక్కడితో ఆగకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా 15,000 సిమెంట్, స్టీల్ , మెటల్ ఫ్రేమ్స్ ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో 40,000 మేర పేదలకు లబ్ధి చేకూరాలని చేస్తుంది. అంతేకాదు పావలా వడ్డీకి 35,000 చొప్పున అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి 2.70 లక్షలు చొప్పున లాభం కలుగుతుంది. దీనికి కారణంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో లక్షకు పైగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.