Ys Jagan : అటు బాబాయ్ కి.. ఇటు అబ్బాయ్ కి.. చెక్ పెట్టే పనిలో వైఎస్ జగన్..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో 2019లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎలక్షన్స్ రెండూ ఒకేసారి జరిగినా శ్రీకాకుళం జిల్లా ఓటర్లు మాత్రం పరిణతితో కూడిన తీర్పిచ్చారు. 10 శాసన సభ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీని గెలిపించి టీడీపీకి 2 చోట్ల మాత్రమే విజయాన్ని కట్టబెట్టారు. తెలుగుదేశం తరఫున గెలిచిన ఇద్దరిలో ఒకరు కింజారపు అచ్చెన్నాయుడు. ఇది కాదు విశేషం. 8 అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ నెగ్గినప్పటికీ శ్రీకాకుళం లోక్ సభ సెగ్మెంట్ లో మాత్రం టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు విక్టరీ కొట్టడం గమనార్హం. దీంతో జగన్ ఈ ఇద్దరికీ చెక్ పెట్టే పనిలో గత రెండేళ్లుగా నిమగ్నమయ్యారు. అచ్చెన్నాయుడిని జైలు పాలు కూడా చేశారు.
దువ్వాడ.. దూకుడు..
అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా అక్కడ అతని హవాకి కామాలు, వీలైతే ఫుల్ స్టాప్ పెట్టేందుకు జగన్.. దువ్వాడ శ్రీనివాస్ ని రంగంలోకి దింపారు. ఎమ్మెల్సీ పదవి సైతం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడి సొంతూరులో అతని కుటుంబ సభ్యుణ్నే పోటీకి నిలబెట్టారు గానీ ఆ ప్రయోగం విఫలమైంది. దీనికి విరుగుడుగా మరో ప్లాన్ వేశారు. అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ చీఫ్ అనే సంగతి తెలిసిందే. అతన్ని పొలిటికల్ గా అటు వైపు నుంచి నరుక్కొచ్చేందుకు జగన్ మీడియా ఇటీవల ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి బట్టబయలు చేసింది. తిరుపతి ఉపఎన్నిక తర్వాత పార్టీ లేదు తొక్క లేదు అంటూ అచ్చెన్నాయుడు రెచ్చిపోయి మాట్లాడిన మాటల వీడియోని వైరల్ చేసింది. వీలైతే మళ్లీ ఒకసారి తనని అరెస్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు స్వయంగా అచ్చెన్నాయుడే మహానాడులో అనుమానం వ్యక్తం చేశారు.
రామ్ వర్సెస్ చిరంజీవి : Ys Jagan
పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు యువకుడు, ఉత్సాహవంతుడు, కాళింగ సామాజికవర్గంవాడు కావటంతో అతనికి ధీటుగా జగన్ కూడా సరిగ్గా అవే సమీకరణలు కలిగిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ ను ఇప్పటినుంచే ప్రిపేర్ చేస్తున్నారు. తదుపరి జనరల్ ఎలక్షన్ లో ఎంపీ టీకెట్ అతనికే అన్నట్లుగా పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చేశారు. తన ప్రభుత్వం అమలుచేస్తున్న వెల్ఫేర్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలాగూ వైఎస్సార్సీపీకి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్లస్ అవుతాయి. కాబట్టి రామ్మోహన్ నాయుడి గెలుపు ఈసారి అంత తేలిగ్గా ఏమీ ఉండబోదని అర్థమవుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒకే జిల్లాలో, ఒకే ఫ్యామిలీకి చెందిన అచ్చెన్న, రామన్న(బాబాయ్.. అబ్బాయ్)లకు జగన్ అప్పుడే స్పాట్ పెట్టాడన్నమాట.