Ys Jagan mohan Reddy : మైతో మేనియాతో బాధపడుతున్న సిఎం జగన్…ఈ జబ్బు వస్తే ఏమవుతుందంటే…?
ప్రధానాంశాలు:
Ys Jagan mohan Reddy : మైతో మేనియాతో బాధపడుతున్న సిఎం జగన్...ఈ జబ్బు వస్తే ఏమవుతుందంటే...?
Ys Jagan mohan Reddy : మైతో మేనియా “దాదాపు తెలుగు వారికి ఎవరికీ తెలియని ఒక రకమైన జబ్బు అని చెప్పాలి. అయితే ఈ రకమైన జబ్బు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నం అవుతున్న ఒక ప్రశ్న అని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ జబ్బు ఉంది అనే విషయాన్ని ప్రజలు సామాన్యులు ఎవరు అడగడం లేదు కానీ టిడిపి నేతలు మాత్రం పదేపదే దీనిపై చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ తాజాగా తన శంఖారావం సభలను మొదలుపెట్టిన క్రమంలో, యువగలం సభలను పూర్తి చేసుకున్న నారా లోకేష్ ఇప్పుడు ప్రజల్లోకి మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 50 రోజుల్లో 150 నియోజకవర్గాలను కవర్ చేయాలి అనే ప్లాన్ తో రోజుకు కనీసం 3 నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన మొదటి సభలో మాట్లాడిన నారా లోకేష్ ” మైతో మేనియా ” అనే జబ్బు గురించి చెప్పారు . ఇక ఈ విషయం చెప్పడమే కాక ఇలాంటి జబ్బు జగన్మోహన్ రెడ్డికి ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అసలు మైతో మేనియా ఏంటి అనే విషయానికొస్తే…
మైతో మేనియా అంటే అబద్ధాలు ఎక్కువగా చెప్పే ఒక రోగం. ఒక మనిషి తన సహజ గుణంలో భాగంగా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అది అందరిలోనూ సహజమే అని చెప్పాలి. కానీ ఈ మైతో మేనియా ఉన్నవారు 100 రెట్లు ఎక్కువగా తనను తాను పోడుకుంటారు. గొప్పలు చెప్పుకుంటారు. ఇలా ప్రతి విషయంలోనూ అబద్ధాలు ఎక్కువగా చెప్పుకుంటూ తిరిగే వారిని మైతో మేనియాకి గురైన వ్యక్తులుగా వైద్యులు చెబుతున్నటువంటి మాట. ఇక ఇలాంటి మైతో మేనియాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారని టిడిపి నేత నారా లోకేష్ గారు అంటున్న మాటలు. అయితే మరి ఆ భారీ బహిరంగ సభలో నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే…. ఆ భారీ బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖను జాబ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దితే జగన్ మోహన్ రెడ్డి దానిని గంజాయి క్యాపిటల్ గా తీర్చిదిద్దారని ఆరోపించారు.
అలాగే విశాఖ రైల్వే జోన్ కి స్థలం కేటాయించలేదని , మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని మాటిచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్కటి అన్న తెరిపించారా అని ప్రశ్నించాడు. విశాఖలో భూకబ్జాలు జరుగుతున్నాయని అడ్డుపడ్డ ప్రభుత్వ అధికారి ఎమ్మార్వో రమణయ్యని కొట్టి చంపారని , అలాగే బాపట్లలో రైతు భరోసా కేంద్రాలలో పనిచేసే పూజిత ఆత్మహత్యకు వైసిపి నేతలు కారణమని నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని తెలియజేశారు. అలాగే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న మైతో మేనియా కారణంగా ఆయన అన్ని మర్చిపోతున్నాడని, అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నాడని అవి చెబుతూ అడ్డంగా దొరికిపోతున్నాడని నారా లోకేష్ వ్యాఖ్యానించాడు.