YS Jagan : Why Not 175… భీమిలి నుండి ప్రచారాలు ప్రారంభించిన వైయస్ జగన్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : Why Not 175… భీమిలి నుండి ప్రచారాలు ప్రారంభించిన వైయస్ జగన్…!

YS Jagan : ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసిపి అన్ని రకాలుగా సిద్ధమై కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అభ్యర్థుల మార్పు చేర్పులను వ్యవహారాలను చక్కబెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది జగన్ ప్రభుత్వం. వై నాట్ 175 లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే భీమిలి నుంచి ఎన్నికల సమరశంఖం పూర్తి చేయనున్నారు. ఇక ఈరోజు నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : Why Not 175... భీమిలి నుండి ప్రచారాలు ప్రారంభించిన వైయస్ జగన్...!

YS Jagan : ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసిపి అన్ని రకాలుగా సిద్ధమై కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అభ్యర్థుల మార్పు చేర్పులను వ్యవహారాలను చక్కబెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది జగన్ ప్రభుత్వం. వై నాట్ 175 లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే భీమిలి నుంచి ఎన్నికల సమరశంఖం పూర్తి చేయనున్నారు. ఇక ఈరోజు నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు పట్టు వదలకుండా గెలుపే లక్ష్యంగా నిలబడే క్యాడర్ కు సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలోని వైసీపీ క్యాడర్ మొత్తం ” ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందె వరకు అలుపు లేదు ” మనకు అనే రీతిలో ముందుకు సాగుతుంది. ఇక జగన్ పరిపాలన ఎలా ఉంటుందో తెలియక ముందే 151 అసెంబ్లీలు 23 ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైసిపి పార్టీ..ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని , కరోనా వంటి అతి క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని , ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన జగన్ పాలన చూసిన ప్రజలు 175 + 25 పెద్ద సమస్య కాదని వైసిపి అభ్యర్థులు భావిస్తున్నారు.

ఇక ఈ ఎజెండాను దృష్టిలో పెట్టుకొని క్యాడర్ ను మరింత ఉత్తేజపూరితంగా మరింత బలంగా మరోసారి అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సమర శంఖం పూరించింది. దీనిలో భాగంగానే రానున్న ఎన్నికల సమరానికి వైసీపీ శ్రేణులను సిద్ధం చేసేందుకుగాను ముఖ్యమంత్రి జగన్ నేటి నుండి విశాఖ మరియు భీమిలి నియోజకవర్గం లో పర్యటించనున్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు విజయనగరం మరియు సార్వతీపురం , మన్యం జిల్లాలనుండి భారీ ఎత్తున వైసిపి పార్టీ శ్రేణులు బహిరంగ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈ భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న విశాఖ జిల్లాలోని విశాఖపట్నం భువనేశ్వర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న , తగరపువలస మూడు కోవెళ్ళు ఎదురుగా ఉన్న ,ల్విశాలవంతమైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక ఈ స్థలం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుందని సమాచారం. ఇక ఈ భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ వైసిపి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఇదే సమయంలో నియోజకవర్గాల లోని పలువురు కార్యకర్తలతో జగన్ ముచ్చటించనున్నారు.

అయితే ఇప్పటికే సామాజిక సమీకరణాలు మరియు సర్వేల ఫలితాలు , ప్రజల అభిప్రాయాలు కార్యకర్తల సూచనల మేరకు పలు నియోజకవర్గాలలో జగన్ అభ్యర్థులను మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైనాట్ 175 కి ఇబ్బంది కలిగించే ఏ చిన్న సమస్యనైనాజగన్ లైట్ తీసుకోవడం లేదు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 58 శాసనసభ మరియు 10 లోక్ సభ స్థానాలకు సమన్వయ కార్యకర్తలను జగన్ నియమించారు. దీంతో గత ఎన్నికల కంటే కూడా ప్రస్తుత ఎన్నికల కోసం జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలోని భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ కు ఇబ్బందులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ భారీ బహిరంగ సభ ఈరోజు మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది