YS Jagan : వైసీపీకి ఎందుకు ఓటేయాలో చెప్పిన జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వైసీపీకి ఎందుకు ఓటేయాలో చెప్పిన జగన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : వైసీపీకి ఎందుకు ఓటేయాలో చెప్పిన జగన్..!

YS Jagan : ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీల ఓట్ల వేటలో పడ్డాయి. అటు ప్రతిపక్షాలు అన్నీ పొత్తులు పెట్టుకుని సమరానికి సై అంటున్నాయి. ఇటు జగన్ ఒంటరిగా రంగంలోకి దిగిపోయారు. మొన్నటి వరకు సిద్ధం సభలతో హోరెత్తించిన ఆయన.. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలను తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అదే అక్కడక్కడా బహిరంగ సభలను పెడుతూ తనకెందుకు ఓటేయాలో కూడా చెబుతున్నారు. ఇక చంద్రబాబు వైసీపీకి ఓటేయొద్దని అంటున్నారని మండిపడ్డారు జగన్.

అదే సమయంలో అసలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలో ఆయన చెప్పాలని.. తనకు ఎందుకు వేయాలో చెబుతానంటూ జగన్ సవాల్ విసిరారు. ఇదే సమయంలో జగన్ తనకు ఎందుకు ఓటేయాలో చెప్పి అందరినీ ఆలోచింపజేసేలా చేశారు. జగన్ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.

అక్కచెళ్లెమ్మలకు ఈ ఐదేళ్లు వచ్చే ఐదేళ్లు కూడా ఆర్థికంగా ఉండేలా బలోపేతం చేసేందుకు వైసీపీకి ఓటేయాలని చెప్పారు. కుటుంబాలకు మూలం అక్కచెల్లెమ్మలు. పథకాల సాయంతో వారిని మరింత బలంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో మళ్లీ అధికారం అడుగుతున్నాం.

చంద్రబాబు హయాంలో ఎన్నడూ చేయని విధంగా రూ.2.70 లక్షల కోట్లు సంక్షేమం కింద పారదర్శకంగా, అవినీతిరహితంగా అందించాం కాబ‌ట్టి మాకు ఓటేయాలి.

దాంతో పాటే బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా లబ్ది దారులకు నగదు సాయం చేసినందుకు ఓటేయాలి. అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, వారి పిల్లలకు అందించే గోరుముద్ద, ట్యాబ్ లు, విద్యా దీవెనలు ఇలా అన్నీ కలుపుకుంటే ఈ ఐదేండ్ల పాలనలో రూ.3.75 లక్షల కోట్లు మా అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చాం. అందుకే వైసీపీకి ఓటేయాలి.

ఎలాంటి లంచాలు లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నాం కాబట్టే వైసీపీకి ఓటేయాలి అని కోరారు.

ఇప్పటికే గ్రామ, వార్డులలో కలుపుకుని వాలంటీర్లతో కలిపి దాదాపు పది శాశ్వత ఉద్యోగాలను కేటాయించాం. కాబట్టి మాకు ఓటేయాలని కోరారు.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం, ప్రపంచస్థాయి చదువులు, పిల్లల చేతుల్లో ట్యాబ్ లు, ప్రభుత్వ స్కూళ్లలో అత్యాధునిక నాణ్యమైన విద్యను అందిస్తున్నాం కాబట్టి మాకు ఓటేయాలని కోరారు జగన్.

అంతే కాకుండా రైతు భరోసా, గ్రామాల్లో ఆర్బీకేలు, రైతులకు సున్నా వడ్డీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ లాంటివి ఇస్తున్నాం కాబట్టి వైసీపీకి ఓటేయాలి.

రైతులకు ఉచిత బీమా, పంట బీమా లాంటివి ఇస్తున్నాం కాబట్టి మాకు ఓటేయాలి.

ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీల్లో ఉన్న అన్ని వర్గాలను ఆదుకున్నాం.. వారికే అత్యధిక ఎంపీ,ఎమ్మెల్యే సీట్లను కేటాయించాం కాబట్టి మాకు ఓటేయాలి అని జగన్ కోరారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది