YS Jagan VS YS Sharmila : సొంత గడ్డపై అధికారం కోసం జగన్ – షర్మిల….కడపలో గెలిచేదేవరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan VS YS Sharmila : సొంత గడ్డపై అధికారం కోసం జగన్ – షర్మిల….కడపలో గెలిచేదేవరు..!

YS Jagan VS YS Sharmila : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు శేరవేగంగా మారుతున్నాయి అని చెప్పాలి. అయితే నిన్నటి వరకు కడప అంటే వైసిపి కుటుంబం వైసిపి కుటుంబం అంటేనే కడప అనే రీతిలో కొనసాగుతూ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య తరువాత కడప కుటుంబం అంతా కళావికులం అయిందని చెప్పాలి. ఒకవైపు విజయమ్మ మరియు షర్మిల […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan VS YS Sharmila : సొంత గడ్డపై అధికారం కోసం జగన్ - షర్మిల....కడపలో గెలిచేదేవరు..!

YS Jagan VS YS Sharmila : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు శేరవేగంగా మారుతున్నాయి అని చెప్పాలి. అయితే నిన్నటి వరకు కడప అంటే వైసిపి కుటుంబం వైసిపి కుటుంబం అంటేనే కడప అనే రీతిలో కొనసాగుతూ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య తరువాత కడప కుటుంబం అంతా కళావికులం అయిందని చెప్పాలి. ఒకవైపు విజయమ్మ మరియు షర్మిల జగన్ కు దూరం కాగ ప్రస్తుతం షర్మిల తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. త్వరలోనే ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె పగ్గాలు తీసుకొన్నున్నారు. ఈ క్రమంలోనే సొంత గడ్డపై ఆమె తన ఉనికి చాటుకోవాలని బలంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత గడ్డ అయిన కడప జిల్లాలో పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో తన భవిష్యత్తుకు పునాది వేసుకునేందుకు షర్మిల ప్రయత్నించనున్నారు. నిజం చెప్పాలంటే షర్మిలకు ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు. ఇక ఈ రెండు నెలల సమయంలోనే షర్మిల తనకి తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ముందుగా షర్మిల తన సోదరుడు జగన్ పై పోరాటం చేస్తేనే రాజకీయ భవిష్యత్తు దక్కుతుంది. దీంతో ప్రస్తుతం వైసీపీ సర్కార్ వైఫల్యాలపై ఆమె విరుచుకు పడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం పుంజుకునే విధానం పైనే షర్మిల రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల కడప జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీకి షర్మిల సైతం సిద్ధంగా ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ నుంచి కానీ కడప పార్లమెంట్ స్థానం నుండి కానీ షర్మిల పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక షర్మిల వెంట వివేకానంద కుమార్తె సునీత నడిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక వివేకానంద హత్యపై సునీత గట్టిగానే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమెకు షర్మిల అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. తన తండ్రి హత్యపై ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారాలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ఆమెకు షర్మిల రూపంలో అరుదైన అవకాశం దక్కిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మరో ఒకటి రెండు రోజుల్లో సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సునీత కాంగ్రెస్ లో చేరితే ఆమెను కడప పార్లమెంట్ నుండి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఇక అప్పుడు షర్మిల పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతుంది. ఇక అదే జరిగితే మాత్రం వైసిపి కుటుంబం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పాలి.

ఎందుకంటే వైయస్ కుటుంబంపై కడప జిల్లాలో విపరీతమైన ఆదరణ ఉంది. కానీ ఎప్పుడైతే వివేకానంద హత్య జరిగిందో అప్పటినుండి చాలామంది అభిమానులు చీలిపోయారు. ఇటు వై.ఎస్ కుటుంబమైన షర్మిల జగన్ కూడా అడ్డగోలుగా చీలిపోయారు. దీంతో ప్రస్తుతం కడప జిల్లాలో మెజారిటీ సభ్యులు మాత్రం షర్మిల మరియు సునీతలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక ఈ కుటుంబం మధ్య నలుగుతున్న రాజకీయ వివాదాలు విపక్షాలు సైతం జాగ్రత్తగా వీక్షిస్తున్నాయి. ఒకవేళ సునీత కడప పార్లమెంట్ స్థానానికి మరియు షర్మిల పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తే విపక్షాలన్నీ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే జరిగితే మాత్రం సొంతగడ్డపై జగన్ అధిపత్యం విఫలం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది